MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil085d9556-13d0-4306-b332-8a6eea06d555-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil085d9556-13d0-4306-b332-8a6eea06d555-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల పాటు ఒక హిట్ ఉంటే నాలుగు ఫ్లాప్ లతో సత్యమతమైపోయిన నిఖిల్ కెరియర్ కు ఊహించని స్థాయిలో ‘కార్తికేయ 2’ బ్రేక్ ఇవ్వడంతో ఒక్కసారిగా అతడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య అతడి నుండి వచ్చేవారం విడుదల కాబోతున్న ‘స్పై’ మూవీ అంచనాలకు అనుగుణంగా హిట్ అయితే అతడు మీడియం రేంజ్ హీరోల టాప్ 5 లిస్టులో చేరిపోవడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను ఈనెల 29న విడుదల చేసే విషయంలో నిఖిల్ కు ఆమూవీ నిర్మాతతో భేధాభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరకు ఇద్దరి మధ్య రాజీ NIKHIL{#}Josh;Athadu;Audience;chandra bose;chandrabose;Subhas Chandra Bose;India;Cinemaనిఖిల్ కు కలిసివస్తున్న కాలం !నిఖిల్ కు కలిసివస్తున్న కాలం !NIKHIL{#}Josh;Athadu;Audience;chandra bose;chandrabose;Subhas Chandra Bose;India;CinemaThu, 22 Jun 2023 09:00:00 GMTకొన్ని సంవత్సరాల పాటు ఒక హిట్ ఉంటే నాలుగు ఫ్లాప్ లతో సత్యమతమైపోయిన నిఖిల్ కెరియర్ కు ఊహించని స్థాయిలో ‘కార్తికేయ 2’ బ్రేక్ ఇవ్వడంతో ఒక్కసారిగా అతడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య అతడి నుండి వచ్చేవారం విడుదల కాబోతున్న ‘స్పై’ మూవీ అంచనాలకు అనుగుణంగా హిట్ అయితే అతడు మీడియం రేంజ్ హీరోల టాప్ 5 లిస్టులో చేరిపోవడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.


వాస్తవానికి ఈ సినిమాను ఈనెల 29న విడుదల చేసే విషయంలో నిఖిల్ కు ఆమూవీ నిర్మాతతో భేధాభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదరడంతో విషయం సుఖాంతం అయింది. ప్రస్తుతం ఈసినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి పరుగులు తీస్తున్నారు. ఈ వీకెండ్ నుండి ఈమూవీ ప్రమోషన్ ప్రారంభం కాబోతోంది.  


అయితే ఈ సినిమాకు చెప్పుకోతగ్గ స్థాయిలో అంచనాలు లేకపోయినప్పటికీ ‘ఆదిపురుష్’ ఫెయిల్ అవ్వడం ఈవారం విడుదల అవుతున్న సినిమాలు అన్నీ మరీ చిన్న సినిమాలు కావడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ‘స్పై’ కలక్షన్స్ కు లోటు ఉండదు అన్న అంచనాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో అంచనాలు లేకుండా విడుదలైన మీడియం రేంజ్ సినిమాలు చాలామటుకు సక్సస్ అయ్యాయి.


ఇప్పుడు అలాంటి అదృష్టం ‘స్పై’ కి పడుతుంది అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణంకు సంబంధించిన ఒక సీక్రెట్ చుట్టూ తిరిగే ఒక ఊహాజనీతమైన కథతో ‘స్పై’ వస్తోంది. సగటు ప్రేక్షకుడుకు తెలియని ఒక వెరైటీ కథను ఎంచుకుని ఆమూవీ స్క్రీన్ ప్లే సస్పెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని మేకింగ్ బాగుంటే అలాంటి సినిమాలకు నెటితరం ప్రేక్షకులు కోట్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి అదృష్టం ‘స్పై’ కి ఎంతవరకు పడుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ‘కార్తికేయ 2’ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ కు ఈమూవీ కూడ హిట్ కొడితే ఇక అతడి కెరియర్ కు తిరుగు ఉండదు..



RRR Telugu Movie Review Rating

అమరావతి : అందరినీ అయోమయంలో పడేస్తున్నారా ? వ్యూహమేనా ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>