LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pregnancy-health4481efee-7dec-4e30-b84f-0436518994c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pregnancy-health4481efee-7dec-4e30-b84f-0436518994c8-415x250-IndiaHerald.jpgపెళ్లయిన ప్రతి స్త్రీ తను ఒక బిడ్డ కంటూ జన్మనివ్వాలని తహతహలాడుతూ ఉంటుంది.కానీ ఈ మధ్యకాలంలో చాలామంది తీరా గర్భం దాల్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందులో ముఖ్యంగా రక్తహీనతలతో బాధపడుతూ,మరణం వరకు వెళ్లిన స్త్రీలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ముందు నుంచే సరైన ఆహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో వచ్చే రక్తహీనతలను పోగొట్టుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.అలాంటి వారు కొన్నిరకాల జ్యూస్ లు తీసుకోవడంతో సరైన పోషకాలు అంది కొత్త రక్త కణాలు వృద్ధి చెంPREGNANCY;HEALTH{#}WOMEN;Vitamin C;Iron;Beetroot;Stree;Pregnant;Cheque;Coriander.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గాలంటే..?గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గాలంటే..?PREGNANCY;HEALTH{#}WOMEN;Vitamin C;Iron;Beetroot;Stree;Pregnant;Cheque;Coriander.Thu, 22 Jun 2023 19:00:00 GMTపెళ్లయిన ప్రతి స్త్రీ తను ఒక బిడ్డ కంటూ జన్మనివ్వాలని తహతహలాడుతూ ఉంటుంది.కానీ ఈ మధ్యకాలంలో చాలామంది తీరా గర్భం దాల్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందులో ముఖ్యంగా రక్తహీనతలతో బాధపడుతూ,మరణం వరకు వెళ్లిన స్త్రీలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ముందు నుంచే సరైన ఆహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో వచ్చే రక్తహీనతలను పోగొట్టుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.అలాంటి వారు కొన్నిరకాల జ్యూస్ లు తీసుకోవడంతో సరైన పోషకాలు అంది కొత్త రక్త కణాలు వృద్ధి చెందుతాయి అని వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.అవేంటో తెలుసుకుందామా..



ప్రూనే జ్యూస్..

ప్రూనే జ్యూస్ సహజ రక్తాన్ని పెంచే పోషకాలను పుష్కళంగా కలిగి ఉంది.ఈ పండు రసంలో ఐరన్ అధికంగా లభిస్తుంది.ఇది చాలా అరుదుగా లభించే నాన్-హీమ్ ఇనుమును కలిగి ఉంటుంది.ఈ పండు అంతగా రుచి ఉండదు,కాబట్టి ఇతర పండ్లతో కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల,సులభంగా తాగవచ్చు.గర్భిణీ స్త్రీలు రక్తహీనతను తగ్గించుకోవడానికి ప్రూనే జ్యూస్ని తాగడం చాలా మంచిది.

బీట్రూట్ కొత్తిమీర జ్యూస్..

రోజు అల్పాహారం సమయం తర్వాత గర్భిణీ స్త్రీలు రోజూ బీట్రూట్ మరియు కొత్తిమీర కలిపి జ్యూస్ తయారు చేసుకొని తాగడం చాలా ఉత్తమం.ఇందులో ఐరన్ కావాల్సినంత లభించడమే కాకుండా,వారికీ మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్,మెగ్నీషియం,పొటాషియం,బీటైన్,విటమిన్ సి వంటి పోషకాలు ఎన్నో పుష్కలంగా లభిస్తాయి.అంతేకాక కాలేయం నుండి టాక్సిన్స్ బయటకు బయటకు పంపించి,రక్తంలో ఉన్న ఎర్ర రక్తకణాలు గరిష్ట ఆక్సిజన్‌ను ఉపయోగించుకునేలా చేస్తాయి.దీనితో రక్తహీనత తగ్గుతుంది.

దానిమ్మ,ఖర్జూరం జ్యుస్..

దానిమ్మ ఖర్జూర జ్యూస్ ని రోజూ తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో కలిగే రక్తహీనతకు చెక్ పెడుతుంది.ఈ రెండు పదార్థాలలోను తగిన మోతాదులో ఐరన్ మరియు విటమిన్ సి అధికంగా లభిస్తాయి.ఈ జ్యుస్ తాగడంతో,రక్తంలోని హిమోగ్లోబిన్‌ని తక్షణమే భర్తీ చేయడమే కాకుండా,కొత్త రక్త కణాలను వృద్ధి చెండడానికి ఉపయోగపడుతుంది.మరియు నీరసం,అలసట వంటి లక్షణాలను కూడా దూరం చేస్తుంది.కావున గర్భిణీ స్త్రీలలో రక్తహీనత పోగొట్టుకోవడానికి ఈ మూడు జ్యూస్ లు తాగడం చాలా ఉత్తమం



RRR Telugu Movie Review Rating

చంద్రముఖి-2 షూటింగ్‌ పూర్తి..?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>