Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attack0c49026d-b03c-4c86-ba49-0e64d48aaa6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attack0c49026d-b03c-4c86-ba49-0e64d48aaa6d-415x250-IndiaHerald.jpgనేటి సభ్య సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందా అంటే ప్రతి ఒక్కరు కూడా అవును అని చెప్పడానికి సంశయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఎందుకంటే సాటి మనుషులకు ఏదైనా చిన్న అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలి పడిన మనుషులు.. ఇప్పుడు ఇక చిన్న చిన్న కారణాలకే ఎదుటి వారిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం దాడులకు పాల్పడుటమే కాదు ఏకంగాదారుణ హత్యలు చేసి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ. Attack{#}akhil akkineni;Attapur;Avunu;Manam;bhavana;Hyderabad;Chiranjeeviపక్కకు జరుగమన్నందుకు.. తల్వార్ తో దాడి.. చివరికి?పక్కకు జరుగమన్నందుకు.. తల్వార్ తో దాడి.. చివరికి?Attack{#}akhil akkineni;Attapur;Avunu;Manam;bhavana;Hyderabad;ChiranjeeviWed, 21 Jun 2023 09:30:00 GMTనేటి సభ్య సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందా అంటే ప్రతి ఒక్కరు కూడా అవును అని చెప్పడానికి సంశయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఎందుకంటే సాటి మనుషులకు ఏదైనా చిన్న అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలి పడిన మనుషులు.. ఇప్పుడు ఇక చిన్న చిన్న కారణాలకే ఎదుటి వారిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం దాడులకు పాల్పడుటమే కాదు ఏకంగాదారుణ హత్యలు చేసి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ.


 చిన్నచిన్న కారణాలకే మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఇక మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగయ్యింది అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారికి ఎవరైనా అడ్డంగా ఉంటే కాస్త పక్కకు జరగండి అని చెబుతూ ఉంటాం. అయితే ఇలా పక్కకు జరగండి అని చెప్పడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారిపోయింది. ఎందుకంటే పక్కకు జరుగు అని చెప్పినందుకు యువకుడు పలువురి పై తల్వార్ తో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని  అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


 సయ్యద్ అబ్దుల్ మోహిత్  ఒక చిరు వ్యాపారి. అయితే ఇటీవలే అతను సమీపంలోని ఏటీఎంకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. అయితే దారికి  అడ్డంగా ఉన్న మన ప్రీత్ సింగ్ ను పక్కకు జరగమని చెప్పాడు. అయితే అప్పటికే మద్య మత్తులో ఉన్న మాన్ ప్రీత్ సింగ్ ఇక తన వద్ద ఉన్న తల్వార్ తో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అయితే సయ్యద్ అప్రమత్తం కావడంతో అతని కంటికి తీవ్ర గాయం అయింది. అయితే అతనికి సర్ది చెప్పేందుకు వచ్చినా మోన్ సైని,  అఖిల్ పై కూడా మాన్ ప్రీత్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాగా స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించగా.. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మన్ ప్రీత్ సింగ్ ని   అదుపులోకి తీసుకున్నారు.



RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>