Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3e19e43a-351d-47e9-b5cb-2a2ba4c59e38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3e19e43a-351d-47e9-b5cb-2a2ba4c59e38-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులు ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెబుతారు ఇండియా పాకిస్తాన్ అని. అయితే ఇండియా పాకిస్తాన్ తర్వాత చిరకాల ప్రత్యర్థులు అనే విధంగా ఆట తీరుతో గుర్తింపు సంపాదించుకున్న టీమ్స్ ఏవి అంటే అవి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీమ్స్ అనే చెప్పాలి. ఇక ఈ రెండు టీమ్స్ కూడా ఎప్పుడు పోటీపడిన హోరాహోరీగా పోరు జరుగుతూ ఉంటుంది. వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఈ రెండు జట్లు.. ఎప్పుడు పోటీపడిన అటు క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్Cricket {#}England;Ben Stokes;Cricket;Australia;Yevaru;Indiaమొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమి.. అంతా బెన్ స్టోక్స్ వళ్లేనా?మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమి.. అంతా బెన్ స్టోక్స్ వళ్లేనా?Cricket {#}England;Ben Stokes;Cricket;Australia;Yevaru;IndiaWed, 21 Jun 2023 09:00:00 GMTవరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులు  ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెబుతారు ఇండియా పాకిస్తాన్ అని. అయితే ఇండియా పాకిస్తాన్ తర్వాత చిరకాల ప్రత్యర్థులు అనే విధంగా ఆట తీరుతో గుర్తింపు సంపాదించుకున్న టీమ్స్ ఏవి అంటే అవి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీమ్స్ అనే చెప్పాలి. ఇక ఈ రెండు టీమ్స్ కూడా ఎప్పుడు పోటీపడిన హోరాహోరీగా పోరు జరుగుతూ ఉంటుంది. వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఈ రెండు జట్లు.. ఎప్పుడు పోటీపడిన అటు క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ కూడా ప్రతిష్టాత్మకమైన యాషెష్ సిరీస్ లో పోటీ పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా జరగగా.. చివరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44 )  లియోన్ (16) ఇక జట్టును ఆదుకున్నారు. దీంతో గెలుస్తుందా లేదా అని ఆస్ట్రేలియా అభిమానులు ఒకానొక సమయంలో ఆందోళన చెందినప్పటికీ అటు ఆస్ట్రేలియా మాత్రం పట్టువదలని  విక్రమార్కుడిలా పోరాడి ఇక విజయం సాధించింది అని చెప్పాలి.


 అయితే ఇలాంటి సమయంలోనే అటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం పై మాత్రం ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఇన్నింగ్స్ ని 393/8 వద్ద డిక్లేర్ చేస్తూ బెన్ స్టోక్స్ నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయం పై ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇంకా పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకొ బెన్ స్టోక్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఎవరికి అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను కట్టడి చేసినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కట్టడి చేయలేకపోయింది ఇంగ్లాండ్ టీం. దీంతో బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకపోయి ఉంటే మొదటి మ్యాచ్ లో గెలిచే వాళ్ళం అంటూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ బెన్ స్టోక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : తెలంగాణా ఎన్నికల ఫలితమిదేనా ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>