MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani46350045-0a1c-4d4d-b2e4-6da0d5fb0e11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani46350045-0a1c-4d4d-b2e4-6da0d5fb0e11-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. కోట్లు పెట్టి తీసే సినిమాల్లో గ్రాఫిక్స్ ఫారిన్ లొకేషన్స్ క్లైమాక్స్ ఫైట్స్ నిర్మాతలు బోలెడంత ఖర్చుచేసి సినిమాలని తీస్తున్నారు. అలాంటిది ఎటువంటి ఆర్భాటం లేకుండా ఎటువంటి హంగు లేకుండా తెలంగాణ నేటివిటీతో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది బలగం సినిమా. తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు పల్లెటూరి ప్రజలు మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాలను జబర్దస్త్ కమెడియన్ వేణు తన దర్శకత్వంలో ఊహించిన విధంగా తరాకెక్కించాడు. Nani{#}Nani;dil raju;priyadarshi;Dussehra;Telangana;Telugu;Jabardasth;Audience;Graphics;Vijayadashami;Yevaru;Venu Thottempudi;Cinema;mediaబలగం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన నాని..!?బలగం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన నాని..!?Nani{#}Nani;dil raju;priyadarshi;Dussehra;Telangana;Telugu;Jabardasth;Audience;Graphics;Vijayadashami;Yevaru;Venu Thottempudi;Cinema;mediaWed, 21 Jun 2023 13:11:09 GMTప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. కోట్లు పెట్టి తీసే సినిమాల్లో గ్రాఫిక్స్ ఫారిన్ లొకేషన్స్ క్లైమాక్స్ ఫైట్స్ నిర్మాతలు బోలెడంత ఖర్చుచేసి సినిమాలని తీస్తున్నారు. అలాంటిది ఎటువంటి ఆర్భాటం లేకుండా ఎటువంటి హంగు లేకుండా తెలంగాణ నేటివిటీతో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది బలగం సినిమా. తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు పల్లెటూరి ప్రజలు మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాలను జబర్దస్త్ కమెడియన్ వేణు తన దర్శకత్వంలో ఊహించిన విధంగా తరాకెక్కించాడు. 

ఇక ఈ సినిమా చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులు అంటూ ఎవరు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రతి గ్రామంలో ఈ సినిమాని ఉచితంగా దర్శించేందుకు బలగం మూవీ ప్రజల్లోకి సైతం వెళ్లడం జరిగింది. అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాని ఎంతలా ప్రశంసించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక విడిపోయిన చాలా కుటుంబాలు ఈ సినిమా చూసిన తర్వాత ఒకటైన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే ఈ సినిమా చూసి కాస్త ఆలస్యంగా రివ్యూ ఇచ్చాడు మన నేచురల్ స్టార్ నాని. లేట్ అయినా సరే లేటెస్ట్ గా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు నాని.

"బలగం సినిమాని ఇంత ఆలస్యంగా ఎందుకు చూశానో అర్థం కావడం లేదు.. ఇంత మంచి సినిమా అని ఇన్ని రోజులు మిస్ అయ్యాను అంటే నేనే నమ్మలేకపోతున్నాను.. తెలుగు సినిమాకి దక్కిన మరొక గౌరవంగా బలగం సినిమాని భావించాలి.. ఇలాంటి సినిమాని అందించిన వేణుకి దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు.. ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి కావ్య కొమురయ్య అతని కుటుంబ సభ్యులు అంతా నటనలో అద్భుతంగా జీవించారు.. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.." అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేశాడు నాని. కాగా నాని షేర్ చేసిన పోస్ట్ కి ప్రియదర్శి వేణు ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. ఆలస్యం కాలేదు నాని అన్న థాంక్యూ. అంటూ రిప్లై ఇచ్చాడు ప్రియదర్శి. ఇక నాని విషయానికొస్తే ఈ మధ్య ఆయన కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో దసరా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ..!!



RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>