Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఐక్యమత్యమే మహాబలం... ఇది చిన్నప్పటి నుంచి వింటున్న పదం.. ఐక్యమత్యంగా ఉంటే సాధించలేనిది ఇంకేది లేదు అని నిరూపించే ఘటనలు నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. కానీ నేటి రోజుల్లో జనాలు మాత్రం అటు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. కానీ ఐక్యమత్యంగా ఉంటే ఎంతటి సవాలునైనా ఎదుర్కోవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. ఇక ఇప్పుడు ఐక్యమత్య మహాబలం అన్నదానికి నిదర్శనంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జంతువులలViral{#}Tiger;Kshanam;Cow slaughterవైరల్ : ప్రమాదకరమైన పులిని.. తరిమికొట్టిన ఆవులు?వైరల్ : ప్రమాదకరమైన పులిని.. తరిమికొట్టిన ఆవులు?Viral{#}Tiger;Kshanam;Cow slaughterWed, 21 Jun 2023 10:30:00 GMTఐక్యమత్యమే మహాబలం... ఇది చిన్నప్పటి నుంచి వింటున్న పదం.. ఐక్యమత్యంగా ఉంటే సాధించలేనిది ఇంకేది లేదు అని నిరూపించే ఘటనలు నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. కానీ నేటి రోజుల్లో జనాలు మాత్రం అటు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి.  కానీ ఐక్యమత్యంగా ఉంటే ఎంతటి సవాలునైనా ఎదుర్కోవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. ఇక ఇప్పుడు ఐక్యమత్య మహాబలం అన్నదానికి నిదర్శనంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 సాధారణంగా అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి పులి పంజా విసిరింది అంటే దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యమే. ఇక సాధు జంతువులైన ఆవు లాంటివి పులి బారిన పడితే ఇక తప్పించుకోవడం కాదు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా ఒక ఆవుపై పులి దాడి చేసింది. అయితే ఇది గమనించిన మిగతా ఆవులు గుంపుగా వెళ్లి పులి పై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో ప్రమాదకరమైన పులి సైతం అక్కడి నుంచి పరార్ అయింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ వీడియోలో ఏముంది అంటే.. ఒక ఆవుల మంద అక్కడ కనిపిస్తుంది. అయితే ఒంటరిగా ఉన్న ఆవుపై అక్కడే పొదల్లో నక్కి ఉన్న పులి పంజా విసిరింది. ఈ క్రమంలోనే ఆహారంగా మార్చుకోవాలని అనుకుంది. కానీ ఆవు చావు కేకలు వేయక ఇక మిగతా ఆవులన్నీ కూడా భయపడలేదు. చెల్లాచెదురుగా అటు ఇటు పారిపోలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందడుగు వేసాయ్. ఆవుల మంద ధైర్యానికి పులి బెదిరింది. చివరికి ప్రమాదకరమైన పులి వెనకడుగు వేసి పొదల్లోకి పారిపోయింది. ఇది చూశాక ఐక్యమత్యం ఎంత బలం అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.
">



RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>