Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonif6180979-d7f0-4029-b39f-884a0c0cce5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonif6180979-d7f0-4029-b39f-884a0c0cce5b-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ప్రత్యేకమైన క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగానే ఒక సాదాసీదా క్రికెటర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ధోని.. ఇక కెప్టెన్సీ అందుకున్నాడు. కెప్టెన్సీ అందుకున్న తర్వాత ధోని ఏం చేస్తాడులే అని అందరూ భావించారు. కానీ తన కెప్టెన్సీ ప్రతిభ ఏంటో తక్కువ సమయంలోనే అందరికీ నిరూపించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతేకాదు 1983 తర్వాత టీమ్ ఇండియాకు అందరిని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను తన కెప్టెన్సీ లోనే అందించి ఇక భారత అభిమానుల దశాబ్దాల కోరికనుDhoni{#}MS Dhoni;BCCI;Chennai;World Cupధోనీకి అందుకే కెప్టెన్సీ ఇచ్చాం.. మాజీ సెలెక్టర్ కామెంట్స్?ధోనీకి అందుకే కెప్టెన్సీ ఇచ్చాం.. మాజీ సెలెక్టర్ కామెంట్స్?Dhoni{#}MS Dhoni;BCCI;Chennai;World CupWed, 21 Jun 2023 07:50:00 GMTభారత క్రికెట్లో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ప్రత్యేకమైన క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగానే ఒక సాదాసీదా క్రికెటర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ధోని.. ఇక కెప్టెన్సీ అందుకున్నాడు.  కెప్టెన్సీ అందుకున్న తర్వాత ధోని ఏం చేస్తాడులే అని అందరూ భావించారు. కానీ తన కెప్టెన్సీ ప్రతిభ ఏంటో తక్కువ సమయంలోనే అందరికీ నిరూపించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతేకాదు 1983 తర్వాత టీమ్ ఇండియాకు అందరిని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను తన కెప్టెన్సీ లోనే అందించి ఇక భారత అభిమానుల దశాబ్దాల  కోరికను నెరవేర్చాడు అని చెప్పాలి.



 ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే మరో వరల్డ్ కప్ ని కూడా అందించి కెప్టెన్సీలో తను తోపు అన్న విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. అయితే ప్రస్తుతం ధోని తర్వాత ఎంతో మంది కెప్టెన్లు మారినప్పటికీ ఎందుకో ధోని రేంజ్ లో మాత్రం జట్టును ముందుండి నడిపించలేకపోతున్నారు. ముఖ్యంగా వరల్డ్ కపులాంటి పెద్ద టోర్నీలలో జట్టును సమర్థవంతంగా లీడ్ చేయలేకపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ధోని అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ గా అదరగొడుతూనే ఉన్నాడు.



 ఇదిలా ఉంటే.. అసలు ధోనిని బిసిసిఐ ఎందుకు కెప్టెన్ గా నియమించింది అనే విషయంపై మాజీ సెలెక్టర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు మాజీ సెలెక్టర్ భూపేంద్ర సింగ్. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్.. టీమ్ ని ముందుండి నడిపించే నాయకత్వ ప్రతిభ.. మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ పరిశీలించాం. ధోని ఇతర ఆటగాళ్లతో మాట్లాడే తీరు. బాడీ లాంగ్వేజ్ తో పాటు అతని ఆట తీరుపై మాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది అందుకే అతన్ని కెప్టెన్ గా నియమించామంటూ మాజీ సెలెక్టర్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

కాలేజీ ఫీజు డబ్బులు.. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టింది.. చివరికి?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>