Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death4b22e21a-9d9d-4006-a41f-95ed907c6f73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death4b22e21a-9d9d-4006-a41f-95ed907c6f73-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వీధి కుక్కలు రెచ్చిపోతూ మనుషులపై దారుణంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఏకంగా వీధి కుక్కలకి మనుషులకి మధ్య తరతరాల నుంచి జాతి వైరం కొనసాగుతుందేమో అన్న విధంగానే కుక్కలు ప్రవర్తిస్తున్నాయి అని చెప్పాలి. అప్పటివరకు సైలెంట్ గా ఉంటున్న కుక్కలు మనుషులు దగ్గరికి రాగానే ఇక దారుణంగా మీద పడిపోయి గాయాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా కుక్కల బారిన పడి ఇప్పటికే ఎంతో మందDeath{#}dhanush;mandalam;chocolate;Dogs;Parugu;Schoolవీధి కుక్కల నుంచి తప్పించుకున్నాడు.. కానీ?వీధి కుక్కల నుంచి తప్పించుకున్నాడు.. కానీ?Death{#}dhanush;mandalam;chocolate;Dogs;Parugu;SchoolWed, 21 Jun 2023 07:30:00 GMTఇటీవల కాలంలో వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వీధి కుక్కలు రెచ్చిపోతూ మనుషులపై దారుణంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఏకంగా వీధి కుక్కలకి మనుషులకి మధ్య తరతరాల నుంచి జాతి వైరం కొనసాగుతుందేమో అన్న విధంగానే కుక్కలు ప్రవర్తిస్తున్నాయి అని చెప్పాలి. అప్పటివరకు సైలెంట్ గా ఉంటున్న కుక్కలు మనుషులు దగ్గరికి రాగానే ఇక దారుణంగా మీద పడిపోయి గాయాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా కుక్కల బారిన పడి ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న అటు రోజు రోజుకి కుక్కల దాడులకు సంబంధించిన ఘటనలు మాత్రం పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. అయితే కొంతమంది కుక్కల దాడిలో గాయాల పాలై చనిపోతుంటే.. ఇంకొంతమంది కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి మరో రూపంలో మృత్యువొడిలోకి చేరుతూ ఉన్నారు. ఇక్కడ ఒక బాలుడు కుక్కల దాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి చివరికి మరో రూపంలో ప్రాణాలు కోల్పోయాడు.



 ఈ విషాదకర ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో ఘటన చోటు చేసుకుంది. ధనుష్ అనే విద్యార్థి కుక్కలు వెంట పడటంతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కానీ మరోవైపు నుంచి దూసుకు వస్తున్న ట్రాక్టర్ ను అతను గమనించలేదు. దీంతో ట్రాక్టర్ కిందపడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవలే స్కూల్ నుంచి చాక్లెట్ కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్ళాడు. మళ్లీ తిరిగి వస్తున్న సమయంలో కుక్కలు వెంట పడడంతో తప్పించుకునేందుకు పరుగు పెట్టి ట్రాక్టర్ కిందపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.



RRR Telugu Movie Review Rating

కాలేజీ ఫీజు డబ్బులు.. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టింది.. చివరికి?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>