Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/black-magicdbe2dbfc-c615-44a2-82bc-f8d3edb765c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/black-magicdbe2dbfc-c615-44a2-82bc-f8d3edb765c5-415x250-IndiaHerald.jpgనేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మే మనుషులు అక్కడక్కడ కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టే వారి కంటే బాబాల దగ్గరికి వెళ్లి తాయత్తు కట్టించుకునే జనాలు నేటి రోజుల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. దీంతో జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది బురిడీ బాబాలు.. ఇక తమ దగ్గరికి వచ్చిన వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు గుంజుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇక మరికొన్ని ఘటనల్లో ఏకంగా తమ దగ్గరికి వచ్చిన మహిళBlack magic{#}Aurangabad;Doctor;Medak;Sangareddy;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;mandalam;police;Mohandas Karamchand Gandhiక్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానం.. గ్రామస్తులు ఏం చేశారో తెలుసా?క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానం.. గ్రామస్తులు ఏం చేశారో తెలుసా?Black magic{#}Aurangabad;Doctor;Medak;Sangareddy;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;mandalam;police;Mohandas Karamchand GandhiWed, 21 Jun 2023 21:15:00 GMTనేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మే మనుషులు అక్కడక్కడ కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టే వారి కంటే బాబాల దగ్గరికి వెళ్లి తాయత్తు కట్టించుకునే జనాలు నేటి రోజుల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. దీంతో జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది బురిడీ బాబాలు.. ఇక తమ దగ్గరికి వచ్చిన వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు గుంజుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇక మరికొన్ని ఘటనల్లో ఏకంగా తమ దగ్గరికి వచ్చిన మహిళలపై అత్యాచారాలు చేస్తున్న బాబాలు జైలు పాలు అవడం కూడా చూసాము.


 ఇలా టెక్నాలజీ యుగంలో కూడా ఎంతోమంది మూఢనమ్మకాలను మాత్రం అస్సలు వీడటం లేదు అని చెప్పాలి. అదే సమయంలో కొంతమంది క్షుద్ర పూజల పేరుతో దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమందిపై క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే అబాండాలు వేసి దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి  అని చెప్పాలి. ఇటీవలే మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.


 ఔరంగాబాద్ వాసి  దమ్మయ్య అనే 60 ఏళ్ల వ్యక్తి పై మంత్రాలు చేస్తున్నాడు అనే నెపంతో ఈనెల 10వ తేదీన గ్రామస్తులు అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇటీవల గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దమ్మయ్య.  అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల సంగారెడ్డి జిల్లాలో సైతం క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే నేపంతో ఇద్దరు దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

తాను చేసిన పనిని సమర్థించుకుంటున్న మిల్కీ బ్యూటీ...!!

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>