MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purushaba4304c-29ee-4a63-b99d-f621b5c2486a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purushaba4304c-29ee-4a63-b99d-f621b5c2486a-415x250-IndiaHerald.jpgప్రభాస్‌ శ్రీ రామునిగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్‌కు డివైడ్‌ టాక్‌ వచ్చినా కానీ ఫస్ట్ వీకెండ్‌లో మాత్రం భారీగా వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా మూడురోజులకు గాను ఏకంగా రూ. 340 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజాగా నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 375 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. కానీ ఆదిపురుష్‌ సినిమాకు సోమవారం నుంచి అసలైన అగ్నిపరీక్ష మొదలైంది. కలెక్షన్లు ఒక్కసారిగా ఏకంగా 75% పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం సోమవారం నాడు ఈ సినADI PURUSH{#}adarsh;monday;sree;bollywood;Prabhas;India;News;Box office;Cinemaభారీ నష్టాలయినా ఆ రికార్డ్ బద్దలు కొట్టిన ఆది పురుష్?భారీ నష్టాలయినా ఆ రికార్డ్ బద్దలు కొట్టిన ఆది పురుష్?ADI PURUSH{#}adarsh;monday;sree;bollywood;Prabhas;India;News;Box office;CinemaTue, 20 Jun 2023 19:15:00 GMTప్రభాస్‌ శ్రీ రామునిగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్‌కు డివైడ్‌ టాక్‌ వచ్చినా కానీ ఫస్ట్ వీకెండ్‌లో మాత్రం భారీగా వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా మూడురోజులకు గాను ఏకంగా రూ. 340 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజాగా నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 375 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. కానీ ఆదిపురుష్‌ సినిమాకు సోమవారం నుంచి అసలైన అగ్నిపరీక్ష మొదలైంది. కలెక్షన్లు ఒక్కసారిగా ఏకంగా 75% పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం సోమవారం నాడు ఈ సినిమా ఆల్ ఇండియా (నెట్) కలెక్షన్ దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే అని తేల్చేసింది.బాలీవుడ్‌లో సోమవారం నాడు నికరంగా రూ.8 కోట్లు మాత్రమే వసూళు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ మొదటి నాలుగు రోజులకు రూ. 113 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.ఇక ఇప్పటి దాకా ఏపీ, తెలంగాణలో రూ.72 కోట్లకు పైగా షేర్ మాత్రమే సాధించింది. గ్రాస్‌ ప్రకారం అయితే మొత్తం రూ. 113 కోట్లు అవుతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా మరో రూ.70 కోట్ల షేర్‌ వరకు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అది జరగటం చాలా కష్టమే అనిపిస్తుంది.


మరో పది రోజులపాటు సినిమాకు కలెక్షన్స్‌ బాగా ఉంటేనే ఇదే సాధ్యమవుతుంది. లేదంటే ప్రభాస్ ఖాతాలో వరుసగా మరో డిజాస్టర్ పడినట్టే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఫస్ట్ వీకెండ్‌లో ఆదిపురుష్ కలెక్షన్స్‌ పఠాన్‌ సినిమాను దాటాయి. అప్పటి దాకా పఠాన్‌ పేరుతో ఉన్న రూ. 313 కోట్ల రికార్డ్‌ను ఆదిపురుష్‌ అధిగిమించింది. కానీ పఠాన్‌ ఫైనల్‌ కలెక్షన్స్‌  రూ. 1000 కోట్ల గ్లోబల్ మార్క్‌ను మాత్రం ఆదిపురుష్‌ ఇప్పుడున్న టాక్ తో ఖచ్చితంగా అధిగమించలేదని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆదిపురుష్‌ సినిమాకు ప్రారంభం నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. దీంతోనే చాలా వరకు నష్టపోయిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ అయిన తరణ్ ఆదర్శ్ తెలిపాడు.ఇంకా అంతే కాకుండా సినిమాలోని VFX కూడా బాగలేదనే టాక్‌ రావడమే కాకుండా క్యారెక్టర్ డిజైన్ కూడా అంతగా బాగాలేదని కామెంట్లు వచ్చాయి. అంతేగాక చివరికి ఈ సినిమా జాతీయ వివాదానికి కూడా దారితీసింది అని ఆయన తెలిపాడు. అందువల్ల ఈ సినిమా ఖచ్చితంగా భారీ నష్టాలను మిగల్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.



RRR Telugu Movie Review Rating

శివ కార్తికేయన్ "మహావీరుడు" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>