PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan2c3c277f-559c-40df-a704-9a0117c4131f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan2c3c277f-559c-40df-a704-9a0117c4131f-415x250-IndiaHerald.jpgకాకినాడలో మాత్రం గంటన్నరసేపు మాట్లాడితే గంటబావుసేపు ఎంఎల్ఏ ద్వారంపూడిని తిట్టడానికే సరిపోయింది. జనసేన అధినేత అయ్యుండి మరీ గల్లీ లీడర్ల స్ధాయికి దిగజారిపోయి మాట్లాడారు. నోటికొచ్చిందంతా తిట్టేశారు. ద్వారంపూడా మట్కా నిర్వహిస్తాడని, సారా వ్యాపారం చేస్తాడని, బియ్యం వ్యాపారం చేస్తాడని, భూములు ఆక్రమించుకుంటాడని, ఎంఎల్ఏ పూర్వీకులు దొంగనోట్లు ముద్రించేవాళ్ళని, వాళ్ళకి పోలీసులు బేడీలువేసి పోలీసుజీపు వెనకాల నడిపించారన్నారు. చివరకు ఎంఎల్ఏ అంతుచూస్తానన్నారు. pawan janasena kakinada {#}Janasena;TDP;YCP;kakinada;Sara Shrawan;MLA;Congress;Pawan Kalyan;policeగోదావరి : పవన్ కు పోటీచేసేంత ధైర్యముందా ?గోదావరి : పవన్ కు పోటీచేసేంత ధైర్యముందా ?pawan janasena kakinada {#}Janasena;TDP;YCP;kakinada;Sara Shrawan;MLA;Congress;Pawan Kalyan;policeTue, 20 Jun 2023 03:00:00 GMT



కాకినాడ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నోటి దురదనంతా తీర్చేసుకున్నారు. కాకినాడ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని తిట్టడం కోసమే పవన్ కాకినాడలో సభ పెట్టినట్లుంది. నాలుగురోజుల క్రితం మొదలైన  వారాహి యాత్రలో పవన్ ఇప్పటికి ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. మొదటి రెండు నియోజకవర్గాల్లో మాట్లాడినపుడు పవన్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.





కాకినాడలో మాత్రం గంటన్నరసేపు మాట్లాడితే గంటబావుసేపు ఎంఎల్ఏ ద్వారంపూడిని తిట్టడానికే సరిపోయింది. జనసేన అధినేత అయ్యుండి మరీ గల్లీ లీడర్ల స్ధాయికి  దిగజారిపోయి మాట్లాడారు. నోటికొచ్చిందంతా తిట్టేశారు. ద్వారంపూడా మట్కా నిర్వహిస్తాడని, సారా వ్యాపారం చేస్తాడని, బియ్యం వ్యాపారం చేస్తాడని, భూములు ఆక్రమించుకుంటాడని, ఎంఎల్ఏ పూర్వీకులు దొంగనోట్లు ముద్రించేవాళ్ళని, వాళ్ళకి పోలీసులు బేడీలువేసి పోలీసుజీపు వెనకాల నడిపించారన్నారు.  చివరకు ఎంఎల్ఏ అంతుచూస్తానన్నారు.





నోటికొచ్చింది బాగా తిట్టేసిన తర్వాత చివరకు ద్వారంపూడి వచ్చేఎన్నికల్లో ఎలా గెలుస్తాడో చూస్తానని చాలెంజ్ చేశారు. రోడ్లపైన ఎంఎల్ఏని తరిమి తరిమి పరిగెత్తించి కొడతానని శపథం చేశారు. వీరమహిళలను ఇష్టంవచ్చినట్లు బూతులు తిట్టి దాడిచేసి కొట్టిన ద్వారంపూడిని ఎప్పటికీ వదిలిపెట్టే ప్రశక్తేలేదని తొడగొట్టి మరీ ప్రతిజ్ఞచేశారు. ఇంత భీకరమైన శపథాలు చేసి తొడలు కొట్టిన పవన్ అదేదో కాకినాడలో తానే పోటీచేస్తే సరిపోతుంది కదా. డైరెక్టుగా ద్వారంపూడిపైన పవన్ పోటీచేసి ఓడిస్తే కసి తీర్చుకున్నట్లు,  ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నట్లుంటుంది. పైగా ద్వారంపూడి కూడా పవన్ను కాకినాడలో తనపై పోటీచేసి గెలవాలని చాలెంజ్ చేశాడు.





అలాకాకుండా పొత్తులో ఇంకెవరైనా పోటీచేస్తే అంత ఎఫెక్టివ్ గా ఉండదేమో. 2009లో కాంగ్రెస్ తరపున, 2019లో వైసీపీ తరపున పోటీచేసిన ద్వారంపూడి గెలిచారు. మధ్యలో 2014లో టీడీపీ అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆర్ధిక, అంగబలం పుష్కలంగా ఉన్న ద్వారంపూడిని ఓడించటం అంత తేలికకాదు. అందుకనే ఇంకెవరినో పోటీలోకి దింపి చాన్సు తీసుకునే బదులు డైరెక్టుగా పవనే పోటీచేసి ద్వారంపూడిని మట్టికరిపిస్తే  ఓ పనైపోతుంది. అప్పుడు పవన్ చాలా గట్టోడని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని జనాలు కూడా మెచ్చుకుంటారు.






RRR Telugu Movie Review Rating

గోదావరి : పవన్ కు పోటీచేసేంత ధైర్యముందా ?

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>