AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/ola6019e542-4333-4756-9452-01dd86dae846-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/ola6019e542-4333-4756-9452-01dd86dae846-415x250-IndiaHerald.jpg2024 వ సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ని లాంచ్ చేయనున్నట్లు గతేడాది ఆగస్టులో ఓలా ప్రకటించింది. అప్పటి నుంచి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు లవర్స్ ను ఓ వార్త షేక్ చేస్తోంది. అదేంటంటే ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని పేటెంట్ ఫొటోస్ ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. అయితే ఇవి చూడటానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ లో ఉన్నాయి. గతంలో ఓలా కంపెనీ విడుదల చేసి టీజర్ లో లాగానే కనిపిస్తున్నా కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. దీంతో అవి బాగా షేర్ అవుతున్నాయి. అయితే చివరి ఉత్పత్తి దశకు వచ్చే సరికి కొన్ని మాOLA{#}Tesla;OLA;Assembly;Car;Manamటెస్లాకి ధీటుగా ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్?టెస్లాకి ధీటుగా ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్?OLA{#}Tesla;OLA;Assembly;Car;ManamSun, 18 Jun 2023 19:34:38 GMT2024 వ సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ని లాంచ్ చేయనున్నట్లు గతేడాది ఆగస్టులో ఓలా ప్రకటించింది. అప్పటి నుంచి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు లవర్స్ ను ఓ వార్త షేక్ చేస్తోంది. అదేంటంటే ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని పేటెంట్ ఫొటోస్ ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. అయితే ఇవి చూడటానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ లో ఉన్నాయి. గతంలో ఓలా కంపెనీ విడుదల చేసి టీజర్ లో లాగానే కనిపిస్తున్నా కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. దీంతో అవి బాగా షేర్ అవుతున్నాయి. అయితే చివరి ఉత్పత్తి దశకు వచ్చే సరికి కొన్ని మార్పులు వాటిల్లో జరిగే ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ కారు సొగసైన ఇంకా మినిమలిస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రదర్శిస్తుంది. ఇది ఐకానిక్ టెస్లా మోడల్ ఎస్, మోడల్ 3ని లాగా ఉంది. ఈ కార్ వెనుక వైపున కూపే లాంటి రూఫ్‌లైన్‌తో సంప్రదాయ సెడాన్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. బాడీ ప్యానెల్‌లు గుండ్రని ఆకృతులు ఇంకా మృదువైన గీతలను కలిగి ఉంటాయి. ఇక ఇవి మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యానికి దోహదం చేస్తాయి. అయితే ఈ కారు సాధారణ ఈవీ డిజైన్‌కు అనుగుణంగా, ఫ్రంట్ గ్రిల్ అనేది లేదు. అయితే దానికి బదులుగా, స్మూత్ ఫ్రంట్ బంపర్ ఫాసియాను ఫిక్స్ చేశారు. బంపర్‌కు పైన హెడ్‌ల్యాంప్ అసెంబ్లీ ఉంది.


ఇక వీటిలో ఎల్ఈడీ లైట్లు ఉండే ఛాన్స్ ఉంది.ఈ కారుని సైడ్ నుంచి చూసినప్పుడు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉన్న స్కూప్డ్ ఫ్రంట్ డోర్‌తో పాటు ఇంకా ఫ్రంట్ ఫెండర్ వెనుక ఒక ఎయిర్ వెంట్ అనేది ఉంటుంది.అలాగే ఈ కారులో సంప్రదాయ వింగ్ మిర్రర్‌లకు బదులుగా కెమెరాలను పొందుపరచవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఓలా కంపెనీ గతంలో ఆన్‌లైన్ టీజర్‌ల శ్రేణిని విడుదల చేసింది.ఇక ఆ టీజర్లలో కారులోని వివిధ పార్టులను లాంచ్ చేసింది. అయితే వాటిల్లో ఇంటీరియర్ డిజైన్ తో పాటు పలు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆక్టాగోనల్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఎక్విప్పిడ్ విత్ హ్యాప్టిక్ కంట్రోల్స్, ఫ్రీ స్టాండింగ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా ల్యాండ్ స్కేప్ టచ్ స్క్రీన్ వంటివి కూడా ఉన్నాయి.ఇది 70-80kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది సింగిల్ చార్జ్ పై 500కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుందని చెబుతున్నారు. అంతేగాక కేవలం నాలుగు సేకన్ల సమయంలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ కార్ అందుకుంటుంది. సహాయక డ్రైవింగ్ సామర్థ్యాలు, కీలెస్ ఇంకా హ్యాండిల్‌లెస్ డోర్‌లను కలిగి ఉండే ఛాన్స్ కూడా ఉంది.



RRR Telugu Movie Review Rating

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇకలేరు.!!

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>