HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf04114fd-396b-4789-a6a6-8074c73895ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf04114fd-396b-4789-a6a6-8074c73895ad-415x250-IndiaHerald.jpgమన వంటింట్లో వుండే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు చాలా ఆరోగ్యకరమైనవి. ఇక వీటిని బడీ ఇలాచీ అని కూడా అంటారు. ముఖ్యంగా మసాలా వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే ఈ యాలకులు నల్లగా చక్కటి వాసనను కూడా కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి బాగా పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా అలాగే ఈ యాలకులను ఉపయోగించడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా మన ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పHEALTH{#}Cardamom;Cancer;Masala;Shakti;Manam;Heartనల్ల యాలకులు ఆరోగ్యానికి ఎంత మంచివంటే..?నల్ల యాలకులు ఆరోగ్యానికి ఎంత మంచివంటే..?HEALTH{#}Cardamom;Cancer;Masala;Shakti;Manam;HeartSun, 18 Jun 2023 17:07:00 GMTమన వంటింట్లో వుండే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు  చాలా ఆరోగ్యకరమైనవి. ఇక వీటిని బడీ ఇలాచీ అని కూడా అంటారు. ముఖ్యంగా మసాలా వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే ఈ యాలకులు నల్లగా చక్కటి వాసనను కూడా కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి బాగా పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా అలాగే ఈ యాలకులను ఉపయోగించడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను  పొందవచ్చు. సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా మన ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా  ఉన్నాయి.ఈ నల్ల యాలకులను వాడడం వల్ల మనం చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.నల్ల యాలకులను ఉపయోగించడం వల్ల జీర్ణ శక్తి బాగా మెరుగుపడుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం ఇంకా అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. ఇంకా అలాగే వీటిని వాడడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.


అలాగే దగ్గు, బ్రాంకైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ నల్ల యాలకులను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇంకా శరీరంలో ఉండే నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇవి చాలా చక్కగా పని చేస్తాయి. అంతేకాకుండా నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేయడంలో బాగా సహాయపడతాయి. ఈ యాలకులను వాడడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా అదే విధంగా నల్ల యాలకులను ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అలాగే ఈ యాలకుల్లో యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి.ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను ఈజీగా నశింపజేసి నోటి ఇన్ఫెక్షన్ లను ఇంకా అలాగే దంతాలు పుచ్చిపోవడాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.



RRR Telugu Movie Review Rating

ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ఆదిపురుష్?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>