Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cficketdf6fda5a-c62c-4330-81b7-d037150d9341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cficketdf6fda5a-c62c-4330-81b7-d037150d9341-415x250-IndiaHerald.jpgదక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాబ్ డూప్లెసెస్ ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దక్షిణాఫ్రికా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించిన డూప్లెసెస్.. ఇక ఇప్పుడు దేశవాళి లీగ్లలో కూడా అదరగొడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఎన్నో సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు డుప్లేసెస్. ఇక తన అద్భుతమైన ఆట తీరుతో చెన్నై జట్టు విజCficket{#}Cricket;Jersey;Chennai;Texasఎల్లో జెర్సీ ధరించబోతున్న.. బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లేసెస్?ఎల్లో జెర్సీ ధరించబోతున్న.. బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లేసెస్?Cficket{#}Cricket;Jersey;Chennai;TexasSun, 18 Jun 2023 07:35:00 GMTదక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాబ్ డూప్లెసెస్ ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దక్షిణాఫ్రికా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించిన డూప్లెసెస్.. ఇక ఇప్పుడు దేశవాళి లీగ్లలో కూడా అదరగొడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఎన్నో సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు డుప్లేసెస్. ఇక తన అద్భుతమైన ఆట తీరుతో చెన్నై జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.



 ఇక ఇలా చెన్నై అభిమానులు అందరినీ కూడా తన ఆటతీరుతో ఆకర్షించి అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే గత రెండు సీజన్ల నుంచి కూడా అటు ఫాబ్ డూప్లెసెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెగా వేలం సమయంలో డూప్లెసెస్ ని వేలంలోకి వదిలేసిన చెన్నై యాజమాన్యం.. మళ్లీ అతని దక్కించుకునేందుకు ప్రయత్నించిన అది కుదరలేదు. దీంతో బెంగళూరు జట్టులోకి వెళ్లి అక్కడ కెప్టెన్సీ అందుకొని జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అతన్ని చాలా మిస్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో బెంగళూరు కెప్టెన్ గా ఉన్న డూప్లెసెస్ మరోసారి ఎల్లో జెర్సీ ధరించబోతున్నాడు అని తెలుస్తుంది.



 అదేంటి మళ్లీ చెన్నై జట్టులోకి రాబోతున్నాడా అని అనుకుంటున్నారు కదా.. నిజమే మరోసారి చెన్నై ఫ్రాంచైజీ  తో జతకట్టబోతున్నాడు.. అమెరికాలో నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 లో ఐపీఎల్ ఆర్సిబి కెప్టెన్ కాస్త చెన్నై కొనుగోలు చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై తరపున అదరగొట్టిన డూప్లెసెస్ ఇక బెంగళూరు తరఫున ఈ ఏడాది ఏకంగా 730 పరుగులు చేసి సూపర్ ఫామ్ కనబరిచాడు. ఈ క్రమంలోనే చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన టెక్సాస్ టీం కి కూడా కెప్టెన్సీ వహించే ఛాన్స్  అందుకున్నాడు అన్నది తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

పవన్‌.. చెప్పులు వదిలేయ్‌.. గ్లాసు పగిలింది చూస్కో?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>