EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrb7c864c5-bf6b-4674-ba15-a050db2c29f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrb7c864c5-bf6b-4674-ba15-a050db2c29f1-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్యమం అనేది ఎప్పుడో నిజాం నవాబులకు వ్యతిరేకంగా మొదలు పెట్టిన ఉద్యమం. అయితే దానిని ఆంధ్రుల వైపుకి మళ్లించడంలో సక్సెస్ అయ్యారు కెసిఆర్. ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు ఆ అభిప్రాయం ఒకలా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం అనేది మరోలా మారిందని తెలుస్తుంది. అప్పటివరకు ఆంధ్ర వాళ్ళు నిజాం నవాబుల కన్నా, రజాకార్లు కన్నా రాక్షసులు అన్నట్టుగా చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రులు కూడా మాతో పాటు భాగమే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తెలంగాణ వాళ్ళని దోచుకున్న ఆంధ్ర వాళ్ళు అంటూ మాట్లాడారుKCR{#}Kanna Lakshminarayana;Election;Nijam;Party;Telangana;Successకేసీఆర్‌.. తెలంగాణను అప్పులపాలు చేశారా?కేసీఆర్‌.. తెలంగాణను అప్పులపాలు చేశారా?KCR{#}Kanna Lakshminarayana;Election;Nijam;Party;Telangana;SuccessSun, 18 Jun 2023 13:00:00 GMTతెలంగాణ ఉద్యమం అనేది ఎప్పుడో  నిజాం నవాబులకు వ్యతిరేకంగా మొదలు పెట్టిన ఉద్యమం. అయితే దానిని ఆంధ్రుల వైపుకి మళ్లించడంలో సక్సెస్ అయ్యారు కెసిఆర్.  ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు ఆ అభిప్రాయం ఒకలా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం అనేది మరోలా మారిందని తెలుస్తుంది. అప్పటివరకు ఆంధ్ర వాళ్ళు నిజాం నవాబుల కన్నా, రజాకార్లు కన్నా రాక్షసులు అన్నట్టుగా చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రులు కూడా మాతో పాటు భాగమే అన్నట్లుగా చెప్పుకొచ్చారు.


ఒకప్పుడు తెలంగాణ వాళ్ళని దోచుకున్న ఆంధ్ర వాళ్ళు అంటూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాది రిచ్ స్టేట్, మీది వెనకబడిన స్టేట్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ల మాటలు నిజం అనుకుంటే నిజంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని దోచుకుని ఉంటే ఆయన చెప్పినట్టు తెలంగాణ రిచ్ స్టేట్ ఎలా అవుతుంది అని కొంతమంది ఈ వ్యాఖ్యలపై సందేహపడుతున్నారు.


ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అప్పుల లెక్క అక్కడ ఉన్న పత్రికలు వివరిస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటివరకు కిస్తీలు వడ్డీలకే సరిపోతున్నాయని, 2.41 లక్షల కోట్లు సర్కార్ కట్టింది అంటూ చెప్పుకొస్తున్నాయి ఆ పత్రికలు. అందులో వడ్డీలకే 1,06,990 కోట్లు పోయాయని చెప్పుకొస్తున్నారు. వచ్చే మూడేళ్లలో మరో రెండు లక్షల కోట్లు కట్టాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.


అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ రాసుకొచ్చాయి ఆ పత్రికలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 7000 కోట్లు కట్టారని, ఇప్పుడు 60 వేల కోట్లు కిస్తీతో సహా కట్టాల్సి వస్తుంది అని రాసుకొస్తున్నాయి. ఏది ఏమైనా సరే సంక్షేమ పథకానికి డబ్బులు వేస్తూ ఉండడంతో డబ్బులనేవి ఈ రకంగా ఓ పక్క నుండి ఖర్చు అయిపోతున్నాయని తెలుస్తుంది.  అసలు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏ పార్టీ గెలిచే అవకాశాలు లేవని మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ నిరూపించాయని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>