MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony7148035e-f572-4d3e-ae3f-908c17fbfd2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony7148035e-f572-4d3e-ae3f-908c17fbfd2e-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు కొత్త కాలం క్రితం బిచ్చగాడు అనే సినిమాలో హీరోగా నటించాడు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ తో ఈ నటుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. బిచ్చగVijay antony{#}vijay antony;cinema theater;Blockbuster hit;Kannada;Tollywood;Tamil;Box office;Telugu;Industry;Heroine;Cinema"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "బిచ్చగాడు 2" మూవీ..!"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "బిచ్చగాడు 2" మూవీ..!Vijay antony{#}vijay antony;cinema theater;Blockbuster hit;Kannada;Tollywood;Tamil;Box office;Telugu;Industry;Heroine;CinemaSun, 18 Jun 2023 05:30:00 GMTతమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు కొత్త కాలం క్రితం బిచ్చగాడు అనే సినిమాలో హీరోగా నటించాడు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ తో ఈ నటుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. బిచ్చగాడు మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ నటుడు తర్వాత తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు.

కానీ ఆ సినిమాలు ఏవి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు రేంజ్ విజయాలను అందుకోలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు బిచ్చగాడు 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే ఈ సినిమాకు ఈయనే స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. కావ్య తప్పర్ ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగు లో కూడా థియేటర్ లలో విడుదల అయింది. బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో బిచ్చగాడు 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ తెలుగు.లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ వర్షన్ లను ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "బిచ్చగాడు 2" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>