PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/manipur-shilllong-modi00003ea4-85a2-47f8-b658-3cfa7f1fa235-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/manipur-shilllong-modi00003ea4-85a2-47f8-b658-3cfa7f1fa235-415x250-IndiaHerald.jpgసెక్యూరిటి అధికారి దినేశ్వర్ సింగ్ మాట్లాడుతు కేంద్రమంత్రి ఇంటిని నాలుగువైపుల నుండి ఒక్కసారిగా దుండగులు చుట్టుముట్టడంతో తాము ఏమీ చేయలేకపోయినట్లు చెప్పారు. సెక్యూరిటిగా ఉన్న 30 మంది ఆయుధాలతో వచ్చిన 1200 మందిని ఎలా ఎదుర్కోగలమని అడిగారు. పరిస్ధితిని అంచనా వేసుకున్న తర్వాత తాము ప్రతిఘటించినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమైపోయిందన్నారు. ఇదే సమయంలో తమను చుట్టుముట్టిన దుండగులు ఒకచోట కూర్చోపెట్టేశారన్నారు. దీంతోనే మణిపూర్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదన్న విషయం తెలిసిపోతోంది. manipur shilllong modi{#}Ranjan Singh;Narendra Modi;Capital;Petrol;central government;Minister;Yevaruషిల్లాంగ్ : మంత్రి ఇంటినే తగలబెట్టేశారా ?షిల్లాంగ్ : మంత్రి ఇంటినే తగలబెట్టేశారా ?manipur shilllong modi{#}Ranjan Singh;Narendra Modi;Capital;Petrol;central government;Minister;YevaruSun, 18 Jun 2023 09:00:00 GMT


మణిపూర్లో మంటలు ఇంకా చల్లారలేదు. చల్లారకపోగా మరింత ఎగిసెగసి పడుతున్నాయి. రాజధాని ఇంపాల్ లోని కేంద్రమంత్రి రంజన్ సింగ్ ఇంటిని దుండగులు తగలబెట్టేశారు. అర్ధరాత్రం సమయంలో కేంద్రమంత్రి ఇంటిమీదకు సుమారు వెయ్యిమంది దాడిచేశారట. సడెన్ గా వచ్చిన వందలమందిని చూసి భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. ఎలాంటి అవాంతరమైనా రావచ్చని ఉన్నతాధికారులు ముందుగానే మంత్రి ఇంటికి హెవీ సెక్యూరిటిని ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగానే 30 మందిని సెక్యూరిటిగా నియమించారు.





అయితే ఒక్కసారిగా వచ్చిన వందలమందిని చూసిన సెక్యూరిటి సిబ్బంది ఏమీచేయలేక చేతులెత్తేశారు. దాంతో సెక్యూరిటిని ఒకచోట కూర్చోబెట్టిన దుండగులు తమతో తెచ్చుకున్న పెట్రోల్ బాంబులను వరుసగా ఇంట్లోకి విసిరి ఇంటిని కాల్చి బూడిదచేసేశారు.  విచిత్రం ఏమిటంటే ఇంఫాల్ లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ వందలమంది ఒకేసారి పెట్రోల్ బాంబులతో కేంద్రమంత్రి ఇంటికి ఎలా చేరుకున్నారు ? అన్నదే అర్ధంకావటంలేదు.





సెక్యూరిటి అధికారి దినేశ్వర్ సింగ్ మాట్లాడుతు కేంద్రమంత్రి ఇంటిని నాలుగువైపుల నుండి ఒక్కసారిగా దుండగులు చుట్టుముట్టడంతో తాము ఏమీ చేయలేకపోయినట్లు చెప్పారు. సెక్యూరిటిగా ఉన్న 30 మంది ఆయుధాలతో వచ్చిన 1200 మందిని ఎలా ఎదుర్కోగలమని అడిగారు. పరిస్ధితిని అంచనా వేసుకున్న తర్వాత తాము ప్రతిఘటించినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమైపోయిందన్నారు. ఇదే సమయంలో తమను చుట్టుముట్టిన దుండగులు ఒకచోట కూర్చోపెట్టేశారన్నారు. దీంతోనే మణిపూర్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదన్న విషయం తెలిసిపోతోంది.





రాష్ట్రంలో పరిస్ధితిని అదుపులోకి తీసుకురావటానికి పెద్దఎత్తున కేంద్ర బలగాలను మోహరించినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదని రంజన్ సింగ్ ఆవేధన వ్యక్తంచేశారు. దుండగులు తనింటిని ఎందుకని  రెండుసార్లు టార్గెట్  చేశారో అర్ధంకావటంలేదన్నారు. లా అండ్ ఆర్డర్ ను మెయిన్ టైన్ చేయటంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందన్నారు. దాడి జరిగినపుడు ఇంట్లో ఎవరు లేకపోవటం వల్లే పెద్ద సమస్య తప్పింది. లేకపోతే ఇంటితో పాటు మనుషులు కూడా సజీవంగా దహనమైపోయేవారే అనటంలో సందేహంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటేంట మణిపూర్లో ఇన్నిరోజులుగా అల్లర్లు జరుగుతున్నా, కేంద్రమంత్రి ఇంటిని తగలబెట్టేసినా నరేంద్రమోడీ మాత్రం ఏమీ మాట్లాడటంలేదు.




RRR Telugu Movie Review Rating

30 ఏళ్ల క్రితం హత్య చేశాడు.. కానీ ఇప్పుడెలా దొరికాడో తెలుసా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>