Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-5ec2c3c0-7ce7-409b-a510-ada38e3078cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-5ec2c3c0-7ce7-409b-a510-ada38e3078cc-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది నూరేళ్ల బంధం అని పెద్దలు చెబుతూ ఉండేవారు. ఒక్కసారి దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత.. ఇక ఒకరికి ఒకరు తోడు నీడగా వందేళ్లపాటు కలిసి మెలిసి బ్రతికేవారు అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో పెళ్లి అనేది కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఇటు అబ్బాయిలు అటు అమ్మాయిలు ఇద్దరు కూడా పెళ్లిని కమర్షియల్ గానే చూస్తున్నారు. తనకు కాబోయే అత్తగారికి భారీగా ఆస్తులు ఉండాలని వరుడు భావిస్తూ ఉన్నాడు. అయితే తనకు కాబోయే వరుడు మంచి ఉద్యోగమో, వ్యాపారం చేస్తూ గట్టిగా సంపాదించేవాడు అయ్యి ఉంటే బాగుంటుందనిMurder {#}police;Aksar;Bike;marriageకట్నం గా బుల్లెట్ బైక్ తీసుకురాలేదని.. అత్తమామలు ఏం చేశారంటే?కట్నం గా బుల్లెట్ బైక్ తీసుకురాలేదని.. అత్తమామలు ఏం చేశారంటే?Murder {#}police;Aksar;Bike;marriageSun, 18 Jun 2023 10:00:00 GMTపెళ్లి అనేది నూరేళ్ల బంధం అని పెద్దలు చెబుతూ ఉండేవారు. ఒక్కసారి దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత.. ఇక ఒకరికి ఒకరు తోడు నీడగా వందేళ్లపాటు కలిసి మెలిసి బ్రతికేవారు అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో పెళ్లి అనేది కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఇటు అబ్బాయిలు అటు అమ్మాయిలు ఇద్దరు కూడా పెళ్లిని కమర్షియల్ గానే చూస్తున్నారు. తనకు కాబోయే అత్తగారికి భారీగా ఆస్తులు ఉండాలని వరుడు భావిస్తూ ఉన్నాడు. అయితే తనకు కాబోయే వరుడు మంచి ఉద్యోగమో, వ్యాపారం చేస్తూ గట్టిగా సంపాదించేవాడు అయ్యి ఉంటే బాగుంటుందని అమ్మాయిలు కూడా కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు.



 అంతేకాదు ఇక కట్న కానుకల విషయంలో కూడా వరుడి కుటుంబ సభ్యులు ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఇక మంచి సంబంధం వచ్చింది అంటే చాలు తాహతకు మించి కట్నాలు ముట్ట చెప్పేందుకు కూడా వధువు కుటుంబ సభ్యులు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అయితే పెళ్లి విషయంలో ఇలా అందరిలో పేరుకుపోయిన కమర్షియల్ ఆలోచన తీరు ఇక ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పెళ్లికి కట్నంగా బుల్లెట్ బైక్ తీసుకురాలేదు అన్న కారణంతో దారుణానికే పాల్పడ్డారు అత్తమామలు. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది.




 అక్సర్ జిల్లాలో జరిగిన ఘటన అందరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. కోడలు కట్నంగా బుల్లెట్ బైక్ తీసుకురాలేదన్న కోపంతో అత్తమామలు ఆమెకు విషయం తాగించి చంపేశారు. అనంతరం కోడలు అనారోగ్యానికి గురైందని.. అందుకే పుట్టింటికి వెళ్ళింది అంటూ కొత్త నాటకాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. అయితే  పుట్టింటి వారు  ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా.. అప్పటికే మృతి చెందింది. విషం తాగడం వల్లే మరణించిందని వైద్యులు తేల్చారు. అయితే గత ఏడాదే సదరు మహిళలకు వివాహం జరగగా.. అప్పటినుంచి ఇక అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>