Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket600471ad-7a11-44c7-a989-529058ff5bbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket600471ad-7a11-44c7-a989-529058ff5bbe-415x250-IndiaHerald.jpgక్రికెట్ లో ఎన్ని ఫార్మాట్లు ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ఆడాలని ఇష్టపడేది మాత్రం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రానించి రికార్డులు కొల్లగొట్టాలని ఇక ప్రతి ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు. అయితే టెస్ట్ ఫార్మాట్ ప్రతి ఒక్క ఆటగాడి ప్రతిభకు సవాలు లాంటిది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో లాగానే క్రీజ్ లోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడుతూ భారీ షాట్లు కొట్టడానికి టెస్ట్ ఫార్మాట్ లో అస్సలు ఛాన్స్ ఉండదు. ఆచితూచి ఆడుతూ సమయం దొరికినప్పుడు మాత్రమే బంతిని బౌండరీకి తరలించేందుకు ఛాన్స్ ఉంటుంది.Cricket{#}Bangladesh;Sri Lanka;INTERNATIONALటెస్ట్ ఫార్మట్ లో.. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అరుదైన రికార్డ్?టెస్ట్ ఫార్మట్ లో.. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అరుదైన రికార్డ్?Cricket{#}Bangladesh;Sri Lanka;INTERNATIONALSun, 18 Jun 2023 13:00:00 GMTక్రికెట్ లో ఎన్ని ఫార్మాట్లు ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ఆడాలని ఇష్టపడేది మాత్రం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రానించి రికార్డులు కొల్లగొట్టాలని ఇక ప్రతి ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు. అయితే టెస్ట్ ఫార్మాట్ ప్రతి ఒక్క ఆటగాడి ప్రతిభకు సవాలు లాంటిది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో లాగానే క్రీజ్ లోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడుతూ భారీ షాట్లు కొట్టడానికి టెస్ట్ ఫార్మాట్ లో అస్సలు ఛాన్స్ ఉండదు. ఆచితూచి ఆడుతూ సమయం దొరికినప్పుడు మాత్రమే బంతిని బౌండరీకి తరలించేందుకు ఛాన్స్ ఉంటుంది.


 ఇలా బౌలర్లు సందించే వైవిద్యమైన బంతులను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటూ ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే.. ఇక మరోవైపు అటు పరుగులు చేయాల్సి ఉంటుంది  అందుకే చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే టెస్ట్ ఫార్మాట్లో రికార్డులు సృష్టించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్ లో ఎవరైనా ఆటగాడు అరుదైన రికార్డు సృష్టించాడు అంటే చాలు వారి పేరు కాస్త అంతర్జాతీయ క్రికెట్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నాజ్ముల్ హుస్సేన్ శాంటో ఇలాంటి ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.



 దీంతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో 146 పరుగులు చేసి అదరగొట్టిన నాజ్మూల్ హుస్సేన్  ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 124 పరుగులు చేసి సెంచరీతో కతం తొక్కాడు. దీంతో వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు  చేసి అరుదైన రికార్డును సృష్టించాడు  బంగ్లాదేశ్ తరపున రెండు ఇన్నింగ్స్ లలో వరసగా సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ గా ఘనత సాధించాడు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ పై ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా కూడా నిలిచాడు. గతంలో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మెమొనూల్ హక్ శ్రీలంక పై వరుసగా రెండు సెంచరీలు  చేశాడు.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>