PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-pithapuram-9950729b-13d5-4cbb-9ad3-ad5fe5714897-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-pithapuram-9950729b-13d5-4cbb-9ad3-ad5fe5714897-415x250-IndiaHerald.jpgఅసలు నేరచరిత్ర ఉన్న వాళ్ళని ఎందుకు గెలిపించారంటే జనాలను నిలదీశారు. పవన్ ప్రసంగంలో ఒక అంశమని ఏమీలేకుండా సంబంధంలేకుండా ఏదేదో మాట్లాడేశారు. అదేదో సినిమాలో కమెడియన్ ఎంఎస్ నారాయణ సుడిగాలిలా తిరుగుతు వచ్చి సంబంధంలేని అనేక విషయాలను అన్నింటినీ కలిపేసి మాట్లాడేస్తాడు. పవన్ ప్రసంగం కూడా అలాగే జరిగింది. ముఖ్యమంత్రి పదవి తీసుకోవటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారట. సీఎం పదవిని అందుకోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండటం ఏమిటో అర్ధంకావటంలేదు. ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్నారు. janasena pawan pithapuram {#}Comedian;kakinada;Annavaram;YCP;CM;Jagan;Janasena;Minister;Telangana Chief Minister;Vishakapatnam;Yatraఅమరావతి : సినిమాలో కమెడియన్ లాగైపోయారా ?అమరావతి : సినిమాలో కమెడియన్ లాగైపోయారా ?janasena pawan pithapuram {#}Comedian;kakinada;Annavaram;YCP;CM;Jagan;Janasena;Minister;Telangana Chief Minister;Vishakapatnam;YatraSun, 18 Jun 2023 03:00:00 GMT

ఒక సినిమాలో కమెడియన్ ఒకదానితో సంబంధంలేకుండా మరొక టాపిక్ మాట్లాడేస్తుంటారు. అచ్చంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పీచ్ కూడా అలాగే ఉంది. పిఠాపురంలో పవన్ ప్రసంగం అంతా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటంతోనే సరిపోయింది. విగ్రహాల ధ్వంసానికి జగన్ కు లింకుపెట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైందని జగన్ పై మండిపడ్డారు. విశాఖపట్నం ఎంపీ భార్య, కొడుకును కిడ్నాప్ చేస్తేనే లా అండ్ ఆర్డర్ ఎంతస్ధాయిలో దిగజారిపోయిందో అర్ధమవుతోందన్నారు.





అసలు నేరచరిత్ర ఉన్న వాళ్ళని ఎందుకు గెలిపించారంటే జనాలను నిలదీశారు. పవన్ ప్రసంగంలో ఒక అంశమని ఏమీలేకుండా సంబంధంలేకుండా ఏదేదో మాట్లాడేశారు. అదేదో సినిమాలో కమెడియన్ ఎంఎస్ నారాయణ సుడిగాలిలా తిరుగుతు వచ్చి సంబంధంలేని అనేక విషయాలను అన్నింటినీ కలిపేసి మాట్లాడేస్తాడు. పవన్ ప్రసంగం కూడా అలాగే జరిగింది. ముఖ్యమంత్రి పదవి తీసుకోవటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారట. సీఎం పదవిని అందుకోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండటం ఏమిటో అర్ధంకావటంలేదు. ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్నారు. 





తన చెప్పులను వైసీపీ ప్రభుత్వం కొట్టేసిందన్నారు. వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా అన్నవరం దేవాలయంలో పూజలు చేయటానికి వెళ్ళారట. పూజలు చేసి తిరిగి వచ్చేటప్పటికి తన చెప్పులను ఎవరో కొట్టేశారన్నారు. తనకు ఎంతో ఇష్టమైన చెప్పులను కొట్టేసిన వాళ్ళెవరో తెలిస్తే చెప్పమని అభిమానులను కోరారు. ఇదే సందర్భంగా తన చెప్పులను కూడా వైసీపీ ప్రభుత్వం కొట్టేసంత స్ధాయికి దిగజారిపోయిందని ఎద్దేవాచేశారు. దేవాలయంలో పవన్ చెప్పులు పోవటం ఏమిటి ? దాన్ని వైసీపీ ప్రభుత్వం కొట్టేసిందని నవ్వుతు జనాలతో చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు.





తనను సీఎం చేయమని జనాలను బతిమలాడుకుంటున్నట్లు చెప్పారు. దయచేసి జనసేనకు ఓట్లేసి తనను సీఎంని చేయండని అర్ధిస్తున్నట్లు చెప్పుకున్నారు. బతిమలాడుకుంటే జనాలు ఓట్లేయరని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, తమను ఆదుకుంటాడని నమ్మితేనే ఓట్లేస్తారని పవన్ మరచిపోయినట్లున్నారు. మొత్తానికి కాకినాడ ఎంఎల్ఏ చంద్రశేఖరరెడ్డి దోపిడి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రు. 10 వేల కోట్ల ఇసుకదోపిడి, విగ్రహాలను ధ్వంసంచేయటం. యువతకు తలా రు.10 లక్షల రుణాలు, తాను రోజుకు ఏడు గంటలు పుస్తకాలు చదవుతానని, రౌడీలను తరిమి తరిమి కొడతానని, సినిమాల్లో తనకు ఎంతమంది హీరోలంటే ఇష్టమనే ఒకదానితో ఒకటి సంబంధంలేని చాలా విషయాలు మాట్లాడేశారు.  




RRR Telugu Movie Review Rating

అమరావతి : సినిమాలో కమెడియన్ లాగైపోయారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>