Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle27265c5f-280c-47c8-8b5e-3e8ba7f6612f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle27265c5f-280c-47c8-8b5e-3e8ba7f6612f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ కి ఒక మంచి గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వరావు తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన స్టార్ హీరో నాగార్జున. ఐతే ఆయన కొడుకుల్లో ఏంటోకొంత పాపులరిటీ ఉన్న హీరో నాగచైతన్య. ఐతే అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు నాగచైతన్య వచ్చారు. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాsocialstars lifestyle{#}geetha;karthikeya;kartikeya;Amazon;Naga Chaitanya;Chitram;News;Tamil;Hero;Cinema;Directorఓటీటీ లో దూసుకుపోతున్న నాగచైతన్య కస్టడీ మూవీ ....!!ఓటీటీ లో దూసుకుపోతున్న నాగచైతన్య కస్టడీ మూవీ ....!!socialstars lifestyle{#}geetha;karthikeya;kartikeya;Amazon;Naga Chaitanya;Chitram;News;Tamil;Hero;Cinema;DirectorSat, 17 Jun 2023 09:15:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ కి ఒక మంచి గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వరావు తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన స్టార్ హీరో నాగార్జున. ఐతే ఆయన కొడుకుల్లో ఏంటోకొంత పాపులరిటీ ఉన్న హీరో నాగచైతన్య. ఐతే అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు నాగచైతన్య వచ్చారు. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. దాదాపు ఈ సినిమా ద్వారా నిర్మాతలు 17 కోట్ల వరకు నష్టపోయారని తెలుస్తుంది.

ఇలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో మే 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన కస్టడీ సినిమా ఓటీటీలో మాత్రం పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉండడంతో వ్యూవర్ షిప్ కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్ లీక్ చేసిన నాగబాబు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>