PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-manifesto94f5beb0-6993-4aae-9165-8e21a71cb058-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-manifesto94f5beb0-6993-4aae-9165-8e21a71cb058-415x250-IndiaHerald.jpgనిరుద్యోగభృతి, అన్నక్యాంటిన్లను ఎన్నికలకు ఆరుమాసాలుండగా మొదలుపెట్టారు. ఇందులో కూడా ఎక్కువగా పార్టీవాళ్ళే లబ్దిదారులుగా ఉండేట్లు చూసుకున్నారు. దాంతో జనాలకు మండిపోయి 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అప్పటి చంద్రబాబు పాలనింకా జనాలకు గుర్తుంది. ఇంతలోనే 2024 ఎన్నికలకు మళ్ళీ హామీలతో రెడీ అయిపోయారు. నిరుద్యోగభృతి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు ఏడాదికి రు. 20 వేలంటు మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. tdp chandrababu manifesto{#}CBN;Dussehra;Mini;Hanu Raghavapudi;Vijayadashami;YCP;Rajahmundry;Partyఅమరావతి : జనాల్లోకి మినీమ్యానిఫెస్టో ఎక్కలేదా ?అమరావతి : జనాల్లోకి మినీమ్యానిఫెస్టో ఎక్కలేదా ?tdp chandrababu manifesto{#}CBN;Dussehra;Mini;Hanu Raghavapudi;Vijayadashami;YCP;Rajahmundry;PartySat, 17 Jun 2023 05:00:00 GMT



తెలుగుదేశంపార్టీ హడావుడి చూస్తుంటే మినీ మ్యానిఫెస్టో జనాల్లోకి ఎక్కినట్లు లేదు. రాజమండ్రి మహానాడు సందర్భంగా చంద్రబాబునాయుడు మొదటివిడత హామీలను గుప్పించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించినట్లు చెప్పారు. పూర్తిస్ధాయి మ్యానిఫెస్టో దసరా పండుగకు రెడీ అవ్వచ్చనట్లుగా చెప్పారు. ఆరుహామీలతో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోను జనాలెవరు పట్టించుకున్నట్లు లేదు. అందుకనే ఈనెల 19వ తేదీనుండి మ్యానిఫెస్టోను జనాలకు వివరించేందుకు అంటు బస్సుయాత్రలు మొదలుపెడుతున్నారు.





నిజానికి చంద్రబాబు హామీలంటే నీటిమీద రాతలని జనాలకు అర్ధమైపోయింది. ఎందుకంటే హామీలిచ్చేటప్పుడు ఎంతో ఆర్భాటంగా ఇస్తారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమీవుండదు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చనేలేదు. ఈ విషయమై వైసీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టగానే పార్టీ వెబ్ సైట్ నుండి మ్యానిఫెస్టోనే మాయంచేసేశారు. ఎంతోకీలకమైన రైతు, డ్వాక్రాసంఘాల రుణమాఫీలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి లాంటివి కూడా చంద్రబాబు నెరవేర్చలేదు.





నిరుద్యోగభృతి, అన్నక్యాంటిన్లను ఎన్నికలకు ఆరుమాసాలుండగా మొదలుపెట్టారు. ఇందులో కూడా ఎక్కువగా  పార్టీవాళ్ళే లబ్దిదారులుగా ఉండేట్లు చూసుకున్నారు. దాంతో జనాలకు మండిపోయి 2019 ఎన్నికల్లో  దారుణంగా ఓడించారు. అప్పటి చంద్రబాబు పాలనింకా జనాలకు గుర్తుంది. ఇంతలోనే 2024 ఎన్నికలకు మళ్ళీ హామీలతో రెడీ అయిపోయారు. నిరుద్యోగభృతి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు ఏడాదికి రు. 20 వేలంటు మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు.





చంద్రబాబు తాజా హామీలను గత హామీల అమలుతో జనాలు పోల్చుకుంటున్నారు. మంత్రులు, వైసీపీ నేతలు ఎలాగూ ఉన్నారు ఇవన్నీ జనాలకు గుర్తుచేయటానికి. దాంతో చంద్రబాబు హామీలను జనాలు నమ్మటంలేదని తమ్ముళ్ళకి అనుమానం వచ్చినట్లుంది. అందుకనే ఈనెల 19వ తేదీనుండి బస్సుయాత్రలు మొదలుపెడుతున్నారు. 125 నియోజకవర్గాల్లో 30 రోజులు తమ్ముళ్ళంతా బస్సుల్లో ప్రయాణిస్తారు. జనాలను కలుసుకుని మినీమ్యానిఫెస్టోను జనాలకు వివరించి చెబుతారట. మినీమ్యానిఫెస్టోని జనాలకు వివరించి చెప్పాలని అనుకోవటం బాగానే ఉంది. కానీ ఆ సందర్భంలో జనాలు 2014 మ్యానిఫెస్టో ఎందుకు అమలుచేయలేదని అడిగితే తమ్ముళ్ళు ఏమి సమాధనం చెబుతారో.




RRR Telugu Movie Review Rating

"లియో" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>