Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/socialstars-lifestylee40fdfcf-faee-4787-b0d7-0932a53fca2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/socialstars-lifestylee40fdfcf-faee-4787-b0d7-0932a53fca2e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన తాజా చిత్రం ఆది పురుష్. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు అనగా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల హంగామా మొదలైంది. ఇక విడుదల తేదికి కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్socialstars lifestyle{#}Chitram;Success;Darsakudu;Aly Khan;India;Hero;bollywood;kriti sanon;Prabhas;Director;Cinema;Juneప్రభాస్ పై వ్యాఖ్యలు చేసిన నటి.....!!ప్రభాస్ పై వ్యాఖ్యలు చేసిన నటి.....!!socialstars lifestyle{#}Chitram;Success;Darsakudu;Aly Khan;India;Hero;bollywood;kriti sanon;Prabhas;Director;Cinema;JuneThu, 15 Jun 2023 21:29:40 GMTటాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన తాజా చిత్రం ఆది పురుష్. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు అనగా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల హంగామా మొదలైంది. ఇక విడుదల తేదికి కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. ప్రభాస్తో కలిసి పనిచేయడం ఎలా ఉంది అని యాంకర్ అడగగా.. కృతి సనన్ మాట్లాడుతూ.. ప్రభాస్ త్వరగా ఎవరిలో కలవడని నేను విన్నాను. ఆయనకు చాలా మెహమాటం ఎక్కువ. కానీ మాట కలపగానే వెంటనే కలిసిపోయారు. నేను నటించిన మొదటి సినిమా గురించి అతడితో చెప్పాను. భాష రాకుండా నటించడం చాలా కష్టమని అన్నాను. ఆ తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎదుటివారికి ఎంతో గౌరవం ఇస్తాడు. సెట్లోనూ తన పని తాను చూసుకొని వెళ్లిపోతాడు. తన కళ్లతోనే మనసులోని భావాలను వ్యక్తం చేయగలడు. ఆదిపురుష్ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ను కాకుండా మరొకరిని ఊహించుకోలేను అని తెలిపింది కృతి సనన్. ఇకపోతే ఆదిపురుష్  సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీతగా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,ట్రైలర్,పోస్టర్,,పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. మరి భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ పై వ్యాఖ్యలు చేసిన నటి.....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>