MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh92b61c28-a329-4092-9e44-d392aef34946-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh92b61c28-a329-4092-9e44-d392aef34946-415x250-IndiaHerald.jpg'నేను శైలజ' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకి యావత్ సినీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారు. సావిత్రి పాత్రలో ఆమె పలికించిన హావ భావాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో కీర్తి సురేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సరసన చేరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి మెప్పించిందిKeerthi Suresh{#}mahesh babu;savitri;king;Success;Savithri;Heroine;India;keerthi suresh;Dussehra;Vijayadashami;Darsakudu;Director;Tollywood;Audience;Telugu;producer;Producer;Heroమరోసారి లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్..ఈసారైనా వర్కౌట్ అయ్యేనా..?మరోసారి లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్..ఈసారైనా వర్కౌట్ అయ్యేనా..?Keerthi Suresh{#}mahesh babu;savitri;king;Success;Savithri;Heroine;India;keerthi suresh;Dussehra;Vijayadashami;Darsakudu;Director;Tollywood;Audience;Telugu;producer;Producer;HeroThu, 15 Jun 2023 16:10:57 GMT'నేను శైలజ' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకి యావత్ సినీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారు. సావిత్రి పాత్రలో ఆమె పలికించిన హావ భావాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో కీర్తి సురేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సరసన చేరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తన కెరీర్లో కీర్తి సురేష్ కొన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేసిన విషయం తెలిసిందే కదా. 

కానీ అవేమి కీర్తి సురేష్ కి సక్సెస్ ని అందించలేకపోయాయి. కీర్తి సురేష్ చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో మళ్లీ లేడీ ఓరియంటెడ్ కథల జోలికి వెళ్లలేదు ఈ హీరోయిన్. ఆ తర్వాత మహేష్ తో 'సర్కారు వారి పాట' సినిమాతో హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా విడుదలైన 'దసరా' సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హిట్ అందుకుంది. దసరా హిట్ తో కీర్తి సురేష్ తెలుగు తో పాటూ తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి సురేష్ మరోసారి ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేయబోతుందట.

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ నూతన దర్శకుడు ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారట. అంతేకాదు ఇందులో కలర్ ఫోటో ఫేమ్ యంగ్ హీరో సుహాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. అయితే గతంలో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో చేతులు కాల్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేయబోతుండడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. మరి గతంలోలా కాకుండా ఈసారైనా ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తో కీర్తి సురేష్ సక్సెస్ సాధిస్తుంది ఏమో చూడాలి..!!



RRR Telugu Movie Review Rating

అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>