EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr9d0ce4d5-3f66-4054-b6a9-73e25f74dc2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr9d0ce4d5-3f66-4054-b6a9-73e25f74dc2d-415x250-IndiaHerald.jpgవైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజలను అనుమతించే వారు. మొదట్లో రోజు అనుమతించారు. తర్వాత వారం రోజులకోసారి అనుమతించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని ప్రజలతో మాట్లాడటం మానేశారు. కేవలం ఆయన ఏదైనా బహిరంగ సభలకు వెళ్లినపుడు మాత్రమే ప్రజల గురించి మాట్లాడతారు. అది కూడా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోతారు. ప్రజలు ఏదైనా అడిగినా నా కంటే ఎక్కువ తెలుసా అని నోరు మూయిస్తారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై ఒక సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని వివాదాస్పద KCR{#}KCR;KTR;dr rajasekhar;pragathi;MLA;local language;Darbar;Telangana;Telangana Chief Minister;CM;Ministerవైఎస్‌ఆర్‌, ఎన్టీఆర్‌: కేసీఆర్‌కు అది పెద్ద మైనస్‌?వైఎస్‌ఆర్‌, ఎన్టీఆర్‌: కేసీఆర్‌కు అది పెద్ద మైనస్‌?KCR{#}KCR;KTR;dr rajasekhar;pragathi;MLA;local language;Darbar;Telangana;Telangana Chief Minister;CM;MinisterThu, 15 Jun 2023 13:00:00 GMTవైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజలను అనుమతించే వారు. మొదట్లో రోజు అనుమతించారు.  తర్వాత వారం రోజులకోసారి అనుమతించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని ప్రజలతో మాట్లాడటం మానేశారు. కేవలం ఆయన ఏదైనా బహిరంగ సభలకు వెళ్లినపుడు మాత్రమే ప్రజల గురించి మాట్లాడతారు. అది కూడా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోతారు. ప్రజలు ఏదైనా అడిగినా నా కంటే ఎక్కువ తెలుసా అని నోరు మూయిస్తారు.


ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై ఒక సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా దర్బార్ ఎందుకు నిర్వహించడం లేదు. ప్రజల తో ఎందుకు మాట్లాడటం లేదంటే ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చి సీఎం కేసీఆర్ కు చెబితే నచ్చదు. నల్లా రావడం లేదని, మోరీ కట్టడం లేదని ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. కొంతమంది పెన్షన్ రావడం లేదని, రేషన్ కార్డు లేదని చెబుతారు. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు చూసుకోవాల్సిన అంశం. వీటికి కూడా సీఎం అవసరం లేదని అన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.


ఇంత వరకు బాగానే ఉన్నా పెన్షన్ అనేది వీరికి చిన్న సమస్య కావచ్చు. అధికారి, ప్రజా ప్రతినిధి, ఎమ్మెల్యే పట్టించుకోకపోతేనే ఇక్కడి దాకా వస్తారని కనీసం కేసీఆర్ కు అవగాహన లేకపోవడం దారుణమని ప్రతిపక్షాలు, రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ప్రజలు చెప్పే సమస్యలు వినడానికి ఓపిక లేక, ప్రజలతో నేరుగా మాట్లాడే సత్తా లేకనే ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు. అధికారులు చేయని పని ఒక్క సీఎం హామీతో నెరవేరుతుందనే ఆశ వారికి ఉంటుంది. కానీ దాన్ని కూడా కాకుండా కేవలం ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం పెట్టుకుంటే సరిపోతుందా అని కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ కి వెళ్లాలని ఉంది అంటున్న వరుణ్ తేజ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>