MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/intinti-ramayanam-moviec62c3094-e805-49b1-a8d4-f05545d5812d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/intinti-ramayanam-moviec62c3094-e805-49b1-a8d4-f05545d5812d-415x250-IndiaHerald.jpgఈమధ్య తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. బలగం, దసరా, మేం ఫేమస్ వంటి సినిమాలు ఇప్పటికే సక్సెస్ సాధించగా తాజాగా తెలంగాణ నేటివిటీతో రూపొందిన మరో చిత్రం 'ఇంటింటి రామాయణం'. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రల్లో తెలికెక్కిన ఈ మూవీ జూన్ 9న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. సితార నాగ వంశీ, మారుతి టాకీస్ సమర్పణలో ఆహా స్టూడియోస్ స్వయంగా రూపొందించిన ఈ సినిమా కంప్లీట్ తెలంగాణ నేటివీటిIntinti Ramayanam Movie{#}Naresh;Suresh;allari naresh;maruti;rahul;gold;Chitram;Rahul Sipligunj;venkat;Telangana;Success;sithara;June;Posters;Cinemaఅప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?Intinti Ramayanam Movie{#}Naresh;Suresh;allari naresh;maruti;rahul;gold;Chitram;Rahul Sipligunj;venkat;Telangana;Success;sithara;June;Posters;CinemaThu, 15 Jun 2023 17:58:30 GMTఈమధ్య తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. బలగం, దసరా, మేం ఫేమస్ వంటి సినిమాలు ఇప్పటికే సక్సెస్ సాధించగా తాజాగా తెలంగాణ నేటివిటీతో రూపొందిన మరో చిత్రం 'ఇంటింటి రామాయణం'. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రల్లో తెలికెక్కిన ఈ మూవీ జూన్ 9న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. సితార నాగ వంశీ, మారుతి టాకీస్ సమర్పణలో ఆహా స్టూడియోస్ స్వయంగా రూపొందించిన ఈ సినిమా కంప్లీట్ తెలంగాణ నేటివీటితో తెరకెక్కింది. సురేష్ నారెడ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఈ సినిమాను ముందుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. 

కానీ ఏమైందో తెలియదు సడన్గా థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 9న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 23 నుంచి ఆహా ఓటీటీలో ఇంటింటి రామాయణం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. రూల్ ప్రకారం ఓ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఇంటింటి రామాయణం సినిమా థియేటర్స్ లో విడుదలై 15 రోజులు కాకముందే ఓటిటి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం. 

బహుశా ఆహా వాళ్లు ఈ సినిమాని నిర్మించారు కాబట్టి ఇంత త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారేమో. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జమ్మికుంట అనే గ్రామంలో జరిగిన కథగా ఈ సినిమా ఉంటుంది. ఓ ఇంట్లో జరిగిన బంగారం చోరీ ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టింది అనేది సినిమా మెయిన్ ప్లాట్. దీన్ని సినిమాలో సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. సందర్భం వచ్చినప్పుడు మంచి ఎమోషన్స్ కూడా చూపించారు. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ కుటుంబం, వారి బంధువులు స్నేహితులు చోరీ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనేది ఇంటింటి రామాయణం కథ. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి...!!
" style="height: 981px;">




RRR Telugu Movie Review Rating

అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>