HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd31b0bd0-59b1-4b3d-aadc-cc0bf3e55f17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd31b0bd0-59b1-4b3d-aadc-cc0bf3e55f17-415x250-IndiaHerald.jpgమనలో చాలా మందిని కూడా ఎంతగానో వేధించే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి.అయితే ఎక్కువగా స్త్రీలు ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు.అయితే ఈ రక్తహీనత సమస్యను తేలికగా అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు నువ్వులతో కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల చాలా ఈజీగా రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ లడ్డూలను తినడం వల్ల నీరసం, బలహీనత వంటి సHEALTH{#}Jaggery;Mixie;Ghee;Manamరక్తహీనత సమస్యని తగ్గించే ఫుడ్ ఇదే?రక్తహీనత సమస్యని తగ్గించే ఫుడ్ ఇదే?HEALTH{#}Jaggery;Mixie;Ghee;ManamThu, 15 Jun 2023 14:42:00 GMTమనలో చాలా మందిని కూడా ఎంతగానో వేధించే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి.అయితే ఎక్కువగా స్త్రీలు ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు.అయితే ఈ రక్తహీనత సమస్యను తేలికగా అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు నువ్వులతో కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల చాలా ఈజీగా రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ లడ్డూలను తినడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.ఇక రక్తహీనత సమస్య నుండి బయటపడేసే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మనం కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. ఇక వీటిని చిన్న మంటపై మాడిపోకుండా వేయించాలి. ఆ నువ్వులు కొద్దిగా వేగిన తరువాత నెయ్యి వేసి కలపాలి. తరువాత ఈ నువ్వులను దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ నువ్వులు చల్లారిన తరువాత వీటిని నుండి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసి పక్కకు ఉంచాలి. ఆ తరువాత మిగిలిన నువ్వులను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం తురుము వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.


తరువాత ఈ నువ్వులు ఇంకా బెల్లం మిశ్రమాన్ని మరోసారి జార్ లో వేసి ముద్దగా అయ్యే దాకా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పక్కకు ఉంచిన నువ్వులను, మరో టీ స్పూన్ నెయ్యిని అలాగే యాలకుల పొడిని వేసి కలపాలి.ఇక ఈ మిశ్రమాన్ని చేత్తో బాగా వత్తుతూ 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తరువాత మనకు పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే నువ్వుల లడ్డూలని తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రక్తహీనత సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ఇంకా అంతేకాకుండా ఈ లడ్డూలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంటుంది. చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. తరచూ చేసే నువ్వుల లడ్డూలతో పాటు తాటి బెల్లం వేసి ఇలా రుచిగా ఇంకా మరింత ఆరోగ్యవంతంగా ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఆది పురుష్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>