MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-and-lavanyae29cf02d-40e8-4983-8ad3-10e843d38d02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-and-lavanyae29cf02d-40e8-4983-8ad3-10e843d38d02-415x250-IndiaHerald.jpgమెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 9వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీ ఎంత ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ప్రస్తుతం వీళ్ళ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఇద్దరు సుమారు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా ఆ విషయాన్ని బయట ఎక్కడా లీక్ చేయలేదు. అంత రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే గతంలో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటVarun Tej And Lavanya{#}praveen;prema;kalyan;December;varun tej;marriage;media;Event;Love;Chiranjeevi;Hero;News;Cinema;Heroineపెళ్లికి ముందే వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కండీషన్.. దానికి ఒప్పుకుంటేనే పెళ్లి..?పెళ్లికి ముందే వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కండీషన్.. దానికి ఒప్పుకుంటేనే పెళ్లి..?Varun Tej And Lavanya{#}praveen;prema;kalyan;December;varun tej;marriage;media;Event;Love;Chiranjeevi;Hero;News;Cinema;HeroineWed, 14 Jun 2023 15:30:00 GMTమెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 9వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీ ఎంత ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ప్రస్తుతం వీళ్ళ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఇద్దరు సుమారు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా ఆ విషయాన్ని బయట ఎక్కడా లీక్ చేయలేదు. అంత రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే గతంలో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినా వాటిపై స్పందించలేదు. 

చివరికి ఎంగేజ్మెంట్ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక వీళ్ళ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనే అంశాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరిలో ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారట. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే పెళ్లికి ముందే వరుణ్ తేజ్ కి ఓ కండిషన్ పెట్టిందట లావణ్య త్రిపాటి. అంతేకాదు ఆ కండిషన్ కి ఓకే చెప్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే.. లావణ్య త్రిపాటికి భరతనాట్యం అంటే చాలా ఇష్టం.

పెళ్లి తర్వాత కూడా భరతనాట్యం చేయాలనేది ఆమె కోరిక. ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ కి చెప్పిందట. పెళ్లి తర్వాత ఏదైనా స్టేజ్ పై భరతనాట్యం చేసే ఛాన్స్ వస్తే తాను ఏమాత్రం వదులుకోనని తేల్చి చెప్పిందట. అలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకపోయినా ప్రొడక్షన్ వైపుకు మాత్రం వెళ్తానని చెప్పిందట. ఇక లావణ్య త్రిపాఠి కండిషన్స్ కి వరుణ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ అంతా కూడా సముకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో 'గాండీవదారి అర్జున' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది..!



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ లో ఆ హీరోనే నంబర్ వన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>