MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg గోపీచంద్ నటించిన తొలి సినిమా ‘తొలి వలపు’ ఫ్లాప్ అయినప్పటికీ ఆతరువాతా అతడు విలన్ గా నటించిన ‘జయం’ ‘వర్షం’ ‘నిజం’ సక్సస్ అవ్వడంతో అతడి కెరియర్ కు బ్రేక్ వచ్చింది. అయితే హీరోగా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఉన్న గోపీచంద్ హీరో పాత్రల పై శ్రద్ధ పట్టడంతో మొదట్లో విజయాలు బాగానే వచ్చాయి. ‘యజ్ఞం’ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరోకి ఆతరువాత కొన్ని మంచి హిట్స్ రావడంతో అతడి కెరియర్ పర్వాలేదు అనుకున్నారు అంతా. అయితే గత దశాబ్ద కాలంగా అతడిని వరసపెట్టి ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. మరొక హీరోకు ఇలాంటి పరిస్థితి gopichand{#}K K Radhamohan;Darsakudu;Kannada;Athadu;Father;Hero;Cinema;Director;Blockbuster hitప్రమాదపు అంచున గోపీచంద్ కెరియర్ !ప్రమాదపు అంచున గోపీచంద్ కెరియర్ !gopichand{#}K K Radhamohan;Darsakudu;Kannada;Athadu;Father;Hero;Cinema;Director;Blockbuster hitTue, 13 Jun 2023 13:11:38 GMT
గోపీచంద్ నటించిన తొలి సినిమా ‘తొలి వలపు’ ఫ్లాప్ అయినప్పటికీ ఆతరువాతా అతడు విలన్ గా నటించిన ‘జయం’ ‘వర్షం’ ‘నిజం’ సక్సస్ అవ్వడంతో అతడి కెరియర్ కు బ్రేక్ వచ్చింది. అయితే హీరోగా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఉన్న గోపీచంద్ హీరో పాత్రల పై శ్రద్ధ పట్టడంతో మొదట్లో విజయాలు బాగానే వచ్చాయి.  

‘యజ్ఞం’ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరోకి ఆతరువాత కొన్ని మంచి హిట్స్ రావడంతో అతడి కెరియర్ పర్వాలేదు అనుకున్నారు అంతా. అయితే గత దశాబ్ద కాలంగా అతడిని వరసపెట్టి ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. మరొక హీరోకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఈపాటికే అతడి కెరియర్ ముగిసిపోయి ఉండేది. అయితే అతడి మంచితనం మరీ ముఖ్యంగా అతడి తండ్రి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ నేపద్యం అతడిని కాపాడుతున్నాయి అని అంటున్నారు.


‘లౌక్యం’ తరువాత అతడికి సరైన హిట్ లేదు. తనకు కలిసివచ్చిన ఈ రెండక్షరాల సెంటిమెంట్ ను తన సినిమాల టైటిల్స్ విషయంలో రిపీట్ చేసినప్పటికీ ఆ సెంటిమెంట్ కూడ కలిసిరాలేదు. ఈ సమ్మర్ రేస్ లో పెద్ద సినిమాల పోటీ లేకపోయినప్పటికీ అతడు నటించిన ‘రామబాణం’ మూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం చాలమందికి షాక్ ఇచ్చింది.

దీనితో గోపీచంద్ తో సినిమాలు తీయాలని భావించే నిర్మాతల పరిస్థితి అయోమయంగా మారింది. అయితే ఇప్పటికీ గోపీచంద్ పై చాలామందికి నమ్మకం ఉండటంతో ఇంకా అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఈ హీరోతో ‘గౌతమ్ నంద’ సినిమాను తీసిన రాధామోహన్ మరొక సినిమాను తీయడానికి ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమాకు కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తూ ఉండటం షాకింగ్ గా మారింది. కన్నడలో టాప్ స్టార్ శివరాజ్ కుమార్‌తో ‘వేద’ అనే బ్లాక్ బస్టర్ తీసిన హర్ష ఈమూవీని తీస్తున్నాడు. నిన్న విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ మంచి స్పందన రావడంతో ఈమూవీతో ఇతడి కెరియర్ గట్టున పడే ఆస్కారం ఉంది అంటున్నారు..  





RRR Telugu Movie Review Rating

ప్రమాదపు అంచున గోపీచంద్ కెరియర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>