Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle97f9e7ca-a5a9-41db-83ce-22348f436ae0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle97f9e7ca-a5a9-41db-83ce-22348f436ae0-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు ప్రభాస్ పాన్ ఇండియా హీరోనే.. ఇక ప్రాజెక్ట్ కే తర్వాత హాలీవుడ్ హీరో అయిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ గతంలో ఓ మాస్ ఎలివేషన్ ఇచ్చాడు నిర్మాత సీ.అశ్వినీదత్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ముందు నుండి మేకర్స్‌ ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో రూపొందిస్తున్నట్లు చెబుతూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు వంటివి తయారు చేస్తsocialstars lifestyle{#}Ravi;ashwini dutt;deepika;maruti;nag ashwin;ravi teja;santhosh narayanan;Makar Sakranti;January;Hollywood;Population;Heroine;Posters;Mass;Prabhas;producer;Producer;India;News;Cinemaసంక్రాంతి బరి నుండి ఆ పాన్ ఇండియా మూవీ తప్పుకున్నాట్లేనా....??సంక్రాంతి బరి నుండి ఆ పాన్ ఇండియా మూవీ తప్పుకున్నాట్లేనా....??socialstars lifestyle{#}Ravi;ashwini dutt;deepika;maruti;nag ashwin;ravi teja;santhosh narayanan;Makar Sakranti;January;Hollywood;Population;Heroine;Posters;Mass;Prabhas;producer;Producer;India;News;CinemaTue, 13 Jun 2023 08:00:00 GMTఇప్పటివరకు ప్రభాస్ పాన్ ఇండియా హీరోనే.. ఇక ప్రాజెక్ట్ కే తర్వాత హాలీవుడ్ హీరో అయిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ గతంలో ఓ మాస్ ఎలివేషన్ ఇచ్చాడు నిర్మాత సీ.అశ్వినీదత్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ముందు నుండి మేకర్స్‌ ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో రూపొందిస్తున్నట్లు చెబుతూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు వంటివి తయారు చేస్తున్నారు. ఇక ఇటీవలే రీఇన్వెంటింగ్‌ ది వీల్‌ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఒక్క టైరు కోసం చిత్రయూనిట్‌ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ వీల్‌ సహాయంతోనే ప్రభాస్‌ టైమ్‌ ట్రావెల్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడని ఇన్ సైడ్ టాక్.

కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలింది. అయితే ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రవితేజ ఈగల్ సినిమా పోస్టర్ రిలీజైంది. అందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు పెద్ద పెద్ద అక్షరాలను పొందుపర్చారు. కాగా ఆ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ నిర్మిస్తుంది. ఇక పీపుల్ మీడియా ప్రభాస్ కు చాలా క్లోజ్. ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను నిర్మిస్తుంది. ఏ ప్రొడ్యూసర్ సహసం చేయలేని విధంగా ఆదిపురుష్ హక్కులను కోట్లు పెట్టి కొనుక్కుంది. అంతేకాకుండా ప్రభాస్ నెక్స్ట్ సినిమా స్పిరిట్ కు సహ-నిర్మాతగా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా మూడు సినిమాలను టేకోవర్ చేసి ప్రభాస్ కు చాలా దగ్గరయ్యారు.

దాంతో ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాదనే సమాచారంతోనే పీపుల్ మీడియా వాళ్లు ఈగల్‌ను పండక్కి షెడ్యూల్ చేసినట్లున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే సినిమా కోసం మ్యూజిక్ వర్క్ ను స్టా్ర్ట్ చేసినట్లు సంతోష్ నారాయణన్ వెల్లడించాడు. సై-ఫై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాజ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>