MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurushc93aa8e4-2487-49eb-acc1-30b7262f8e96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurushc93aa8e4-2487-49eb-acc1-30b7262f8e96-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవడిగా , కృతిసనన్ జానకి గా, మలయాళ నటుడు దేవదత్త ఆంజనేయుడిగా నటించబోతున్నారు.. ఇకపోతే ఈ సినిమా జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే భారీగా టికెట్లను సినిమా సెలబ్రిటీలే కొనుగోలు చేస్తూ ఉండడం గమనార్హం. భారతీయ ఇతిహాస గాధ అయిన రామాయణం ను ప్రతి ఒక్కరు చూడాలన్న నేపథ్యంలో అనాధ పిల్లలకి, పేదవారికి ADIPURUSH{#}Prabhas;Ananya Pandey;Ranbir Kapoor;ananya;krishnam raju;kriti sanon;manchu manoj kumar;AdiNarayanaReddy;bollywood;Cinema;Telugu;media;producer;Event;Producer;Khammam;Ananya Nagalla;Chitramఆది పురుష్ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!ఆది పురుష్ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!ADIPURUSH{#}Prabhas;Ananya Pandey;Ranbir Kapoor;ananya;krishnam raju;kriti sanon;manchu manoj kumar;AdiNarayanaReddy;bollywood;Cinema;Telugu;media;producer;Event;Producer;Khammam;Ananya Nagalla;ChitramTue, 13 Jun 2023 07:00:00 GMTప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవడిగా , కృతిసనన్ జానకి గా, మలయాళ నటుడు దేవదత్త ఆంజనేయుడిగా నటించబోతున్నారు.. ఇకపోతే ఈ సినిమా జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే భారీగా టికెట్లను సినిమా సెలబ్రిటీలే కొనుగోలు చేస్తూ ఉండడం గమనార్హం.  భారతీయ ఇతిహాస గాధ అయిన రామాయణం ను  ప్రతి ఒక్కరు చూడాలన్న నేపథ్యంలో అనాధ పిల్లలకి, పేదవారికి ఈ సినిమాను ఉచితంగా చూపించడానికి పలువురు వ్యక్తులు ముందుకు రావడం జరిగింది. ఇక వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పేదవారికి ఈ సినిమాను చూపించాలని నేపథ్యంలో ఏకంగా పదివేల టికెట్లను కొనుగోలు చేశారు.  మరొకవైపు ప్రముఖ నిర్మాత అభిషేక అగర్వాల్ కూడా పదివేల టికెట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటితో పాటు ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 101 టికెట్లు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.  అలాగే అనన్య బిర్లా కూడా ఈ సినిమాను పేదలకు ఉచితంగా చూపించడానికి టికెట్లను కొనుగోలు చేయడం జరిగింది.

ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మంచు మనోజ్ దంపతులకు కూడా చేరిపోయారు.  మంచు మనోజ్ దంపతులు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనాధ శరణాలయాల్లో ఉన్న 2500 మంది పిల్లలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తామని అందుకు రెండు ప్రైవేటు సంస్థలతో చేయి కలుపుతున్నామని ప్రకటించారు. ఇకపోతే వీరంతా కూడా ఆది పురుష్ సినిమా కోసం ముందుకు రావడం నిజంగా హర్షదాయకమని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా విడుదలకు ముందే భారీ ధరకు అమ్ముడుపోయి కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>