Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayyarf7062870-d39f-4663-9c3f-8e7dd52e86bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayyarf7062870-d39f-4663-9c3f-8e7dd52e86bb-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత క్రికెట్కు ఫ్యూచర్ స్టార్స్ దొరుకుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఒకప్పుడు దేశవాళి క్రికెట్లో రాణించిన ఆటగాళ్లలో కొంతమందిని ఏరి కోరి మరి సెలక్టర్లు జట్టులోకి తీసుకునేవారు. అయితే ఇప్పుడు దేశవాళి క్రికెట్లో ఎన్ని పరుగులు చేసినా.. ఎంత మంచి ప్రదర్శన కనబరిచిన కూడా అటు ఐపీఎల్ ప్రదర్శన ప్రస్తుతం సెలెక్టర్లకు మొదటి ఆప్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఐపిఎల్ లో బాగా రాణిస్తే చాలు ఇక కొన్ని రోజులకే ఆ ఆటగాడు టీమిండియా జట్టులో కనిపించడం ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉనAyyar{#}Venkatesh;Hardik Pandya;Indiaహార్దిక్ లాగా.. నిఖార్సైన ఆల్ రౌండర్ అవ్వాలని ఉంది?హార్దిక్ లాగా.. నిఖార్సైన ఆల్ రౌండర్ అవ్వాలని ఉంది?Ayyar{#}Venkatesh;Hardik Pandya;IndiaTue, 13 Jun 2023 07:25:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత క్రికెట్కు ఫ్యూచర్ స్టార్స్ దొరుకుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఒకప్పుడు దేశవాళి క్రికెట్లో రాణించిన ఆటగాళ్లలో కొంతమందిని ఏరి కోరి మరి సెలక్టర్లు జట్టులోకి తీసుకునేవారు. అయితే ఇప్పుడు దేశవాళి క్రికెట్లో ఎన్ని పరుగులు చేసినా.. ఎంత మంచి ప్రదర్శన కనబరిచిన కూడా అటు ఐపీఎల్ ప్రదర్శన ప్రస్తుతం సెలెక్టర్లకు మొదటి ఆప్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఐపిఎల్ లో బాగా రాణిస్తే చాలు ఇక కొన్ని రోజులకే ఆ ఆటగాడు టీమిండియా జట్టులో కనిపించడం ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నాం.


 ఇక ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న స్టార్ ప్లేయర్స్  అందరూ కూడా ఒకప్పుడు ఇక ఐపీఎల్ లో రాణించి ఇక సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్న వారే అనడంలోనూ సందేహం లేదు. ఇలా ఐపీఎల్ లో ప్రతిభ చాటుకుని టీమ్ ఇండియాలోకి వచ్చిన వారిలో అటు ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో రాణించిన కొన్ని రోజులకే టీమ్ ఇండియాలోకి వచ్చేసాడు. అయితే హార్దిక్ పాండ్యా గాయపడటం ఇక అతనికి టీమిండియాలోకి రావడానికి మంచి అవకాశం గా మారిపోయింది. కానీ మళ్ళి హార్దిక్ వచ్చి అద్భుతమైన ఫామ్ కనబరుస్తూ ఉండడంతో ఇక వెంకటేష్ అయ్యర్ ని పట్టించుకునే వారే లేకుండా పోయారు అని చెప్పాలి.


 దీంతో గత కొంతకాలం నుంచి అతనికి టీమిండియాలో ఎక్కువగా అవకాశాలు లభించడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వెంకటేష్ అయ్యర్. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా లాగా కంప్లీట్ ఆల్ రౌండర్ అనిపించుకోవాలని ఉంది అంటూ తెలిపాడు. ఇటీవల ఇండియా టివి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, డెత్ ఓవర్లలో ఇలా ఏ స్థానంలో ఆడటానికైనా నేను సిద్ధం. అంతేకాదు మీడియం ఫేస్ బౌలింగ్ కూడా చేస్తాను. ఇక భారత జట్టులో స్థానం గురించి ఆలోచించడం లేదు. నేను బాగా ఆడితే జట్టులో చోటు అదే దక్కుతుంది అంటూ వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>