PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-modi-bjp-tdp79a8386a-0a26-41f4-acef-1bda93cb55c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-modi-bjp-tdp79a8386a-0a26-41f4-acef-1bda93cb55c3-415x250-IndiaHerald.jpgపైన పేర్కన్న వాళ్ళల్లో ఎవరు కూడా జగన్ కు ఎప్పుడూ తోడులేరు. తోడులేకపోగా 24 గంటలు, 365 రోజులు జగన్ పై బురదచల్లటమే టార్గెట్ గా పనిచేస్తుంటారు. కానీ మొదటిసారి తనకు బీజేపీ కూడా తోడుగా ఉండకపోవచ్చని జగన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే దుష్టచతుష్టయంతో బీజేపీని కూడా జగన్ కలిపేసినట్లే అనుమానంగా ఉంది. జగన్ తాజా వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఇకనుండి బీజేపీని కూడా రెగ్యులర్ గా టార్గెట్ చేయబోతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. jagan modi bjp tdp{#}central government;Minister;Amit Shah;TDP;Bharatiya Janata Party;Jagan;CBN;Yevaru;Reddyఅమరావతి : బీజేపీ మీద కూడా ఫైట్ కు జగన్ రెడీ అయిపోయారా ?అమరావతి : బీజేపీ మీద కూడా ఫైట్ కు జగన్ రెడీ అయిపోయారా ?jagan modi bjp tdp{#}central government;Minister;Amit Shah;TDP;Bharatiya Janata Party;Jagan;CBN;Yevaru;ReddyTue, 13 Jun 2023 07:00:00 GMT



రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బిగ్ ఫైట్ కు రెడీ అయిపోయినట్లే ఉన్నారు. అందుకనే పల్నాడులో విద్యాకానుక పంపిణీ సందర్భంగా జరిగిన సభలో ఒకరకంగా బీజీపీని కూడా డైరెక్టు ఎటాక్ చేశారు. బహిరంగసభలో జగన్ మాట్లాడుతు తనకు దుష్టచతుష్టయంతో పాటు ఎల్లోమీడియా మద్దతు లేదన్నారు. పనిలోపనిగా బీజేపీ మద్దతు కూడా ఉండకపోవచ్చన్నారు. దుష్టచతుష్టయమని, ఎల్లోమీడియాని, దత్తపుత్రుడని జగన్ చెప్పటం మామూలే.





పైన పేర్కన్న వాళ్ళల్లో ఎవరు కూడా జగన్ కు ఎప్పుడూ తోడులేరు. తోడులేకపోగా 24 గంటలు, 365 రోజులు జగన్ పై బురదచల్లటమే టార్గెట్ గా పనిచేస్తుంటారు. కానీ మొదటిసారి తనకు బీజేపీ కూడా తోడుగా ఉండకపోవచ్చని జగన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే దుష్టచతుష్టయంతో బీజేపీని కూడా జగన్ కలిపేసినట్లే అనుమానంగా ఉంది. జగన్ తాజా వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఇకనుండి బీజేపీని కూడా రెగ్యులర్ గా టార్గెట్ చేయబోతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





అదికూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగసభ తర్వాత మాత్రమే. బహిరంగసభల్లో వాళ్ళిద్దరు డైరెక్టుగా జగన్ను టార్గెట్ చేశారు. జగన్ పాలనంతా అవినీతి, అక్రమాలు, భూకుంభకోణాలే అని ఇద్దరు వేర్వేరు బహిరగసభల్లో దుమ్మెత్తిపోశారు. వాళ్ళకి సమాధానంగా అన్నట్లుగా నడ్డా, అమిత్ పేరెత్తకుండానే తనకు బీజేపీ మద్దతు ఉండకపోవచ్చన్నారు. మొత్తానికి ఇంతకాలం జగన్ పై ఆరోపణలు చేయని నడ్డా, అమిత్ రెచ్చిపోయారు. అలాగే జగన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మొదటిసారి కామెంట్ చేశారు. 





తాను పైనున్న దేవుడిని ముందున్న ప్రజలను తప్ప ఇంకెవరినీ నమ్ముకోలేదని స్పష్టంగా చెప్పారు. కాబట్టి తన పాలనలో మంచి జరిగిందని అనిపిస్తే ఓట్లేసే రాబోయేఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని అభ్యర్ధించారు. తన ప్రతి ఆలోచనా, ప్రతి అడుగు పేదలకోసమే అన్న విషయం జనాలందరు అర్ధంచేసుకోవాలన్నారు. చంద్రబాబు ఆలోచనలంతా ఎప్పుడూ పెత్తందార్లకోసమే అని రుజువైందన్నారు. తొందరలోనే టీడీపీ దుకాణం మూసేస్తారని కాబట్టి జనాలంతా జాగ్రత్తగా ఆలోచించుకుని రాబోయే ఎన్నికల్లో ఓట్లేయాలని జగన్ సూచించారు.




RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>