MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money21763a6b-5bea-4696-8f6e-13ac20bed7bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money21763a6b-5bea-4696-8f6e-13ac20bed7bb-415x250-IndiaHerald.jpgలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటేనే ప్రజలలో ఇప్పుడు బాగా నమ్మకం పెరిగిపోయింది. అందరూ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇదే క్రమంలో ఎల్ఐసి కూడా వినియోగదారులను ఆకర్షించడానికి పలు రకాల పాలసీలను అందిస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత జీవితానికి సంబంధించిన అత్యుత్తమమైన పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాటిల్లో అతి ముఖ్యమైనది.. సరళమైనది ఎల్ఐసి జీవన్ అక్షయ్ VII.. ఇందులో ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు.MONEY{#}LIC;February;Yevaru;IndiaMoney: మరో అద్భుతమైన పాలసీతో ముందుకు వచ్చిన ఎల్ఐసి..!Money: మరో అద్భుతమైన పాలసీతో ముందుకు వచ్చిన ఎల్ఐసి..!MONEY{#}LIC;February;Yevaru;IndiaTue, 13 Jun 2023 11:00:00 GMTలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటేనే ప్రజలలో ఇప్పుడు బాగా నమ్మకం పెరిగిపోయింది. అందరూ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇదే క్రమంలో ఎల్ఐసి కూడా వినియోగదారులను ఆకర్షించడానికి పలు రకాల పాలసీలను అందిస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత జీవితానికి సంబంధించిన అత్యుత్తమమైన పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాటిల్లో అతి ముఖ్యమైనది.. సరళమైనది ఎల్ఐసి జీవన్ అక్షయ్ VII.. ఇందులో ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పథకం ఎలా పనిచేస్తుంది.. అర్హులు ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పెన్షన్ కావాలని కోరుకునేవారు ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.  ఎల్ఐసి అందిస్తున్న ఈ పాలసీని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ పాలసీ తీసుకోవడానికి మీరు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 28న ఈ ఏడాది ఆరంభంలో ఎల్ఐసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో పాలసీదారులకు వారు నిర్దిష్ట అవసరాల ఆధారంగా పలు విభిన్నమైన యాన్యుటీ ఆప్షన్లను కూడా ఎంచుకునే సౌలభ్యాన్ని అందించింది.

ఇకపోతే రూ .5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు ధర లేదా ప్రారంభంలో ఏక మొత్తం చెల్లించినా సరే పాలసీదారులు పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. ఇందులో 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు చేరడానికి అర్హులు.. గరిష్టంగా 100 సంవత్సరాల వరకు వయసు ఉండవచ్చు ఎల్ఐసి జీవన్ VII పాలసీలో లక్ష రూపాయల సింగిల్ ప్రీమియం చెల్లించిన వారికి ఏడాదికి 12,000 రూపాయల యాన్యుటీ లభిస్తుంది. అలాగే సెక్షన్ 80c కింద రూ .1.5లక్షల వరకు పన్ను తగ్గింపు పొందుతారు. తనకైతే ఎల్ఐసి అందిస్తున్న ఈ పాలసీ మంచి లాభాలను అందిస్తోంది అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

ప్రమాదపు అంచున గోపీచంద్ కెరియర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>