EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india66d41f3d-0554-4a96-9108-19f8c5907891-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india66d41f3d-0554-4a96-9108-19f8c5907891-415x250-IndiaHerald.jpgకొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ తో పాటు దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు రాలేదు. అయితే ఆ నూతన పార్లమెంట్ భవనంలో భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా సనాతన ధర్మం, దేశాన్ని పాలించిన రాజులు, వారి చరిత్ర ఆనవాళ్లు, తదితర గొప్ప విషయాలను అన్నింటిని తీర్చి దిద్దారు. దేశ ఔన్నత్యం గురించి తెలిపేలా ప్రతి అంశాన్ని పొందుపరిచారు. అయితే.. ముఖ్యంగా అఖండ భారత దేశం చిత్రపటాన్ని పొందు పరచడం పై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రధానమంత్రి ఇండియా వచ్చిన సందర్భంగా దాన్ని చూసి అభ్యంతరం వ్యకINDIA{#}mithra;Pakistan;Nepal;Parliment;Ala Ela;Parliament;Narendra Modi;Prime Minister;politics;vedhika;Congress;history;Culture;Indiaమన పార్లమెంటు మ్యాప్‌.. పాక్‌ గుండెల్లో భగభగలు?మన పార్లమెంటు మ్యాప్‌.. పాక్‌ గుండెల్లో భగభగలు?INDIA{#}mithra;Pakistan;Nepal;Parliment;Ala Ela;Parliament;Narendra Modi;Prime Minister;politics;vedhika;Congress;history;Culture;IndiaTue, 13 Jun 2023 00:00:00 GMTకొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ తో పాటు దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు రాలేదు. అయితే ఆ నూతన పార్లమెంట్ భవనంలో భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా సనాతన ధర్మం, దేశాన్ని పాలించిన రాజులు, వారి చరిత్ర ఆనవాళ్లు, తదితర గొప్ప విషయాలను అన్నింటిని తీర్చి దిద్దారు. దేశ ఔన్నత్యం గురించి తెలిపేలా ప్రతి అంశాన్ని పొందుపరిచారు.


అయితే.. ముఖ్యంగా అఖండ భారత దేశం చిత్రపటాన్ని పొందు పరచడం పై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రధానమంత్రి ఇండియా వచ్చిన సందర్భంగా దాన్ని చూసి అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ  ఇది ఇప్పటిది కాదు. రెండు వేల సంవత్సరం నాటి పరిస్థితుల్లో ఉన్న అఖండ భారత్ అని చెప్పింది. దీనికి పాకిస్థాన్ మండి పడింది. భారత్ తమ దేశంలో అంతర్భాగమని  తమది అఖండ పాకిస్థాన్ అని చెప్పుకొచ్చింది.


ఇండియా నుంచి పాక్ విడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ పాక్ నుంచి ఇండియా విడిపోలేదు. ఇలాంటి సందర్భంలో అలా ఎలా అంటారని భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు అంటున్నారు. అఖండ భారత్ అంటే దాదాపు 2 వేల ఏళ్ల కంటే ముందు ఉన్న భారత్ అని చెబుతున్నారు. ఇలా నూతన పార్లమెంట్ భవనం కూడా రాజకీయాలకు వేదిక అవుతుందని ఎవరూ అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు ఏకంగా నరేంద్ర మోదీ పై వ్యతిరేకత పెట్టుకుని చట్టాలు చేసే సభకు రాకపోవడం ఎంతవరకు సమంజసమని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంతో మంది ప్రధానులుగా చేశారు. కానీ నూతన పార్లమెంటు భవనం రాబోయే భవిష్యత్ అవసరాల కోసం మాత్రం కట్టలేకపోయారు. దాన్ని ప్రధాని మోదీ హయాంలో కడితే దానిపైన కూడా రాజకీయాలు చేస్తున్నారని అనేక మంది మండి పడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ సినిమాలో మరో హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>