Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ott4044094f-7c32-45db-87ac-b790a37e2ed3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ott4044094f-7c32-45db-87ac-b790a37e2ed3-415x250-IndiaHerald.jpgఇండియాలో ఒకప్పుడు ఒకటి, అరా ఓటీటీ యాప్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, వూట్‌, జీ5, ఎంఎక్స్‌ ప్లేయర్ వంటి ఎన్నో ఓటీటీ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటి మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఓటీటీ సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా జియో సినిమా ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే కల్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు ఎవ్రీ వీక్ ఒక కొత్త సినిమా, ఎవ్రీ డే ఒక కొత్త వెబ్‌సిరీస్ ఎపిసోడ్‌ను ఫ్రీగా ఆఫర్ Ott{#}Amazon;Jio;television;Cricket;vegetable market;Fridayజియో సినిమా దెబ్బకు దిగి రానున్న ఓటీటీ సంస్థలు..??జియో సినిమా దెబ్బకు దిగి రానున్న ఓటీటీ సంస్థలు..??Ott{#}Amazon;Jio;television;Cricket;vegetable market;FridayTue, 13 Jun 2023 22:00:00 GMTఇండియాలో ఒకప్పుడు ఒకటి, అరా ఓటీటీ యాప్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, వూట్‌, జీ5, ఎంఎక్స్‌ ప్లేయర్ వంటి ఎన్నో ఓటీటీ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటి మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఓటీటీ సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా జియో సినిమా ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే కల్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు ఎవ్రీ వీక్ ఒక కొత్త సినిమా, ఎవ్రీ డే ఒక కొత్త వెబ్‌సిరీస్ ఎపిసోడ్‌ను ఫ్రీగా ఆఫర్ చేస్తామని జియో సినిమా ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి పాపులర్ ఓటీటీ సంస్థలు కూడా ఉచిత బాటపడుతున్నాయి. ఇలాంటి ఆఫర్ల వల్ల మామూలు టీవీ ఛానల్ మూతపడుతున్నాయి. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ క్రికెట్‌ వరల్డ్ కప్‌, ఆసియా కప్‌లను తమ ప్లాట్‌ఫామ్‌లో ఫ్రీగా ప్రసారం చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దాదాపు 50 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఈ రెండు క్రికెట్ టోర్నమెంట్లను డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ఫ్రీగా చూడొచ్చని వెల్లడించింది.

మొత్తం మీద ఒక్కో సంస్థ ఫ్రీ బాట పడుతుండటంతో మిగతా సంస్థలు కూడా అదే ట్రెండ్ ఫాలో కావడం అనివార్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఉచితంగా కంటెంట్ ఆఫర్ చేస్తాయని, లేదంటే ఛార్జీలను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బాగా పాపులర్ అయిన సంస్థలు తమ యూజర్లను ఇతర సంస్థల ఆఫర్లతో సంబంధం లేకుండా నిలుపుకోగలుగుతాయని ఒక అధికారి తెలిపారు. కాగా జియో సినిమా ఫాలో అవుతున్న స్ట్రాటజీల వల్ల ఓటీటీ సంస్థలన్నీ కూడా తక్కువ ధరలకే, లేదా ఉచితంగా కంటెంట్ ఆఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే అనుమానం కలుగుతుంది.

టెలిగ్రామ్ రంగంలో జియో మొదటగా ఫ్రీ అంటూ అందరినీ తన వైపు తిప్పుతుంది. ఓటిటి రంగంలో కూడా ఇప్పుడు జియో సినిమా అదే మార్కెట్ వ్యూహం ఫాలో అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.



RRR Telugu Movie Review Rating

మరొకసారి అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్ భార్య..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>