MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ash-rejected-bollywood-ramayana5c837682-77cd-4b53-ab6d-2e9fce7601e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ash-rejected-bollywood-ramayana5c837682-77cd-4b53-ab6d-2e9fce7601e7-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే మరో రామాయణం పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే రామాయణం ఇతిహాసాల ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో శ్రీరాముడిగా పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి రామాయణం ఆధారంగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత కొన్నKGF Hero Yash{#}Alia Bhatt;prashanth neel;Prasanth Neel;Varsham;Saif Ali Khan;News;Hero;Box office;Yash;Kannada;Hindi;Director;KGF;India;Prabhas;June;bollywood;Cinemaబాలీవుడ్ రామాయణం ను రిజెక్ట్ చేసిన యష్.. కారణం అదేనా..?బాలీవుడ్ రామాయణం ను రిజెక్ట్ చేసిన యష్.. కారణం అదేనా..?KGF Hero Yash{#}Alia Bhatt;prashanth neel;Prasanth Neel;Varsham;Saif Ali Khan;News;Hero;Box office;Yash;Kannada;Hindi;Director;KGF;India;Prabhas;June;bollywood;CinemaTue, 13 Jun 2023 16:03:15 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే మరో రామాయణం పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే రామాయణం ఇతిహాసాల ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో శ్రీరాముడిగా పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి రామాయణం ఆధారంగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఈ ప్రాజెక్టు గురించి బాలీవుడ్ లో తెగ చర్చలు జరుగుతున్నాయి. 

అయితే ఈ హిందీ రామాయణంలో శ్రీరాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో రావణుడి పాత్ర కోసం కే జి ఎఫ్ హీరో యశ్ ని మూవీ టీం ఇటీవల సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. యష్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాడని తెలియడంతో ఈ ప్రాజెక్టు పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం యశ్ ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఉన్న స్థాయిలో కెరీర్ పరంగా ఇలాంటి రోల్స్ తనకు కరెక్ట్ కాదని ఆయన భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణంలో రావణాసురుడి పాత్ర అంటే కచ్చితంగా అందులో పుష్కలంగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి.

అందుకే రావణాసురుడి పాత్రలో నటించడానికి తాను సముఖంగా లేనని నితీష్ తివారి టీం కి యష్ చెప్పినట్లు ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హీరో యష్ నుంచి గాని ఆయన టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక కే జి ఎఫ్ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక గత ఏడాది విడుదలైన కేజిఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక కేజీఎఫ్ తర్వాత ఇప్పటివరకు యష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. ఫ్యాన్స్ మాత్రం యష్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏ డైరెక్టర్ తో ఉంటుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

బాలీవుడ్ కు సిద్ధం అవుతున్న కోలీవుడ్ స్టార్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>