MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepreddyf32ad7e4-c0ca-48e7-8a4f-da39ef1c7c19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepreddyf32ad7e4-c0ca-48e7-8a4f-da39ef1c7c19-415x250-IndiaHerald.jpg ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా సంచలన దర్శకుడుగా మారిన సందీప్ వంగ నుండి అనేక బ్లాక్ బష్టర్ సినిమాలు వస్తాయని చాలామంది అంచనాలు వేసారు. అయితే సందీప్ తనకు కలిసొచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడ బ్లాక్ బష్టర్ హిట్ కొట్టడంతో బాలీవుడ్ లో కూడ అతడి పేరు మారుమ్రోగి పోయింది.ఆతరువాత అతడు యూటర్న్ తీసుకుని టాలీవుడ్ టాప్ హీరోలలో ఎవరో ఒకరితో మరొక యాక్షన్ మూవీ చేయాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అతడి ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీనితో తిరిగి బాలీవుడ్ బాట పట్టి తాను తెలుగు టాప్ హsandeepreddy{#}Allu Arjun;Jr NTR;sandeep;Tollywood;Arjun Reddy;september;Remake;Athadu;bollywood;Telugu;media;India;Hero;News;Cinemaయానిమల్ మ్యానియాను మిస్ చేసుకున్నది ఎవరు ?యానిమల్ మ్యానియాను మిస్ చేసుకున్నది ఎవరు ?sandeepreddy{#}Allu Arjun;Jr NTR;sandeep;Tollywood;Arjun Reddy;september;Remake;Athadu;bollywood;Telugu;media;India;Hero;News;CinemaTue, 13 Jun 2023 09:00:00 GMT
‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా సంచలన దర్శకుడుగా మారిన సందీప్ వంగ నుండి అనేక బ్లాక్ బష్టర్ సినిమాలు వస్తాయని చాలామంది అంచనాలు వేసారు. అయితే సందీప్ తనకు కలిసొచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడ బ్లాక్ బష్టర్ హిట్ కొట్టడంతో బాలీవుడ్ లో కూడ అతడి పేరు మారుమ్రోగి పోయింది.


ఆతరువాత అతడు యూటర్న్ తీసుకుని టాలీవుడ్ టాప్ హీరోలలో ఎవరో ఒకరితో మరొక యాక్షన్ మూవీ చేయాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అతడి ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీనితో తిరిగి బాలీవుడ్ బాట పట్టి తాను తెలుగు టాప్ హీరోలలో ఎవరో ఒకరితో చేయాలనుకుని భావించిన యానిమల్ మూవీ కథను బాలీవుడ్ టాప్ హీరో రిషీ కపూర్ కు వినిపించడం అతడు వెంటనే ఓకె చెప్పడం జరిగిపోయింది.


రాబోతున్న సెప్టెంబర్ లో విడుదలకాబోతున్న ఈమూవీకి సంబంధించిన టీజర్ కు విడుదలైన కొద్ది సేపటికే విపరీతమైన స్పందన వచ్చింది. గొడ్డలితో ఊచకోత కోస్తున్న రుషీ కపూర్ చేతిలో ఉన్న గొడ్డలి రక్తంతో నిండి ఉన్న లుక్ కు విపరీతమైన స్పందన వస్తోంది. గతంలో అర్జున్ రెడ్డి ప్రమోషన్ సమయంలో మీడియా వర్గానికి చెందిన కొందరు సందీప్ రెడ్డిని ఎందుకు అర్జున్ రెడ్డి లాంటి రఫ్ సినిమాను తీసావు అని ప్రశ్నించినప్పుడు ఇది కేవలం సాంపిల్ మాత్రమే అనీ దానికన్నా 100 రెట్లు అధికంగా రఫ్ గా ఉండే సినిమా తీయబోతున్నట్లు అప్పట్లో చెప్పాడు.


అప్పటి నుంచే అతడి మనసులో ఉన్న రఫ్ కథ సినిమాగా ప్రాణం పోసుకుని ‘యానిమల్’ గా రాబోతోంది. వాస్తవానికి ఈ కథను బాలీవుడ్ హీరోకు వినిపించే ముందు అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ లకు వినిపించాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ కథను మన టాప్ హీరోలు పెద్దగ నమ్మక పోవడంతో ఇప్పుడు రరణబీర్ కపూర్ వచ్చాడనుకోవాలి. అయితే పాన్ ఇండియా స్థాయిలో యానిమల్ టీజర్ కు వచ్చిన స్పందన చూస్తుంటే మాన టాప్ హీరోలు ఒక బ్లాక్ బష్టర్ హిట్ ను పోగొట్టుకున్నారా అన్న సందేహాలు రాబడం సహజం..    






RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : ఉక్కు ఆస్తులు అమ్మేస్తున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>