PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambati-ycp-tdp-congress4b7f1793-f2aa-458e-94d3-88a64720ad1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambati-ycp-tdp-congress4b7f1793-f2aa-458e-94d3-88a64720ad1a-415x250-IndiaHerald.jpgమాజీ క్రికెటర్ అజరుద్దీన్ తో రాయుడుకి ఉన్న సన్నిహితం కారణంగా అంబటిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే మల్కాజ్ గిరి ఎంపీ స్ధానంలో పోటీకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రాయుడుకు గుంటూరు ఎంపీగా టికెట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ నుండి కూడా ఆఫర్ అందినట్లు చెబుతున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వచ్చేఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారు. ambati ycp tdp congress{#}Ambati Rayudu;Galla Jayadev;District;Congress;TDP;Guntur;MP;Yevaruఅమరావతి : ఏ పార్టీ తరపున అంబటి బ్యాటింగ్ చేస్తారో ?అమరావతి : ఏ పార్టీ తరపున అంబటి బ్యాటింగ్ చేస్తారో ?ambati ycp tdp congress{#}Ambati Rayudu;Galla Jayadev;District;Congress;TDP;Guntur;MP;YevaruMon, 12 Jun 2023 07:00:00 GMT


క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. అంబటి రాజకీయాల్లోకి వస్తాడని, రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు బాగా ప్రచారమవుతోంది. అయితే ఏ పార్టీలో చేరుతారు ? ఎక్కడినుండి పోటీచేస్తారు ? అనేది సస్పెన్సుగా మారిపోయింది. తాను రాజకీయాల్లోకి దిగుతున్నట్లు, పోటీచేయాలని ఉందని కానీ రాయుడు ఇంతవరకు ప్రకటించలేదు. కానీ రాయుడు పొలిటికల్ ఎంట్రీపై విపరీతమైన వార్తలు, కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.





గుంటూరు జిల్లా పొన్నూరు సొంతూరైన రాయుడు తాజాగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడు, దాంతో అంబటి వైసీపీలో చేరి పోటీచేయటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే రాష్ట్రంలో క్రీడాభివృద్దికి తన సేవలను అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని మాత్రమే రాయుడు చెప్పారు. సరే ఎందుకు భేటీ అయినా మాట్లాడుకున్న విషయాలన్నీ బయటకు చెప్పాలని, చెబుతారని ఎవరు అనుకోవటంలేదు. అయితే రాయుడును కాంగ్రెస్ లో చేర్చుకుని మల్కాజ్ గిరి పార్లమెంటుకు పోటీచేయించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయట.





మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తో రాయుడుకి ఉన్న సన్నిహితం కారణంగా అంబటిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే మల్కాజ్ గిరి ఎంపీ స్ధానంలో పోటీకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రాయుడుకు  గుంటూరు ఎంపీగా టికెట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ నుండి కూడా ఆఫర్ అందినట్లు చెబుతున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వచ్చేఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారు.





ఎలాగూ గుంటూరులో కొత్త అభ్యర్ధిని పోటీకి దింపాల్సుంటుంది కాబట్టి పాపులరైన అంబటినే రంగంలోకి దింపితే బాగుంటందని చంద్రబాబునాయుడు కూడా అనుకుంటున్నట్లు సమాచారం. కాపు సామాజికవర్గంకు చెందిన అంబటి ఎంపీగా  పోటీచేస్తే ఇటు కమ్మ, అటు కాపు సామాజికవర్గం ఓట్లు పడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. అంబటిని తమ తరపున పోటీలోకి దింపాలని టీడీపీ, కాంరెస్ ప్రయత్నాలు చేస్తున్న విషయం అర్ధమవుతోంది. కానీ అంబటి మనసులో ఏముందో మాత్రం తెలీటంలేదు. మరెప్పుడు క్లారిటి ఇస్తారో చూడాలి.




RRR Telugu Movie Review Rating

ఆది పురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>