DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedనారా లోకేష్ ను మొన్నటి వరకు జనాలు చూసిన డైమెన్షన్ ఇప్పుడు మారింది. మొదటి వరకు ఆయనని విమర్శించిన ప్రత్యర్థులు, ప్రక్క పార్టీ వాళ్లు ఆయన అభివృద్ధి చెందిన క్రమాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లుగా తెలుస్తుంది. సరిగ్గా మాట్లాడటం రాదని, ఆయన బాడీ లాంగ్వేజ్ మీద విమర్శలు చేసిన మనుషులు ఇప్పుడు లోకేష్ పరిణితిని చూసి ఆశ్చర్యపోతున్నట్లుగా తెలుస్తుంది. నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 400 రోజులుకు 4వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో ఒక ధైర్యం పెరిగిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకLOKESH{#}Lokesh;Lokesh Kanagaraj;Varsham;Yevaru;Telugu Desam Party;Party;Nara Lokesh;CBNలోకేశ్‌ గ్రాఫ్‌.. క్రమంగా పెరుగుతోందా?లోకేశ్‌ గ్రాఫ్‌.. క్రమంగా పెరుగుతోందా?LOKESH{#}Lokesh;Lokesh Kanagaraj;Varsham;Yevaru;Telugu Desam Party;Party;Nara Lokesh;CBNMon, 12 Jun 2023 13:00:00 GMTనారా లోకేష్ ను మొన్నటి వరకు జనాలు చూసిన డైమెన్షన్ ఇప్పుడు మారింది. మొదటి వరకు ఆయనని విమర్శించిన ప్రత్యర్థులు, ప్రక్క పార్టీ వాళ్లు ఆయన అభివృద్ధి చెందిన క్రమాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లుగా తెలుస్తుంది. సరిగ్గా మాట్లాడటం రాదని, ఆయన బాడీ లాంగ్వేజ్ మీద విమర్శలు చేసిన మనుషులు ఇప్పుడు లోకేష్ పరిణితిని చూసి ఆశ్చర్యపోతున్నట్లుగా తెలుస్తుంది.


నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 400 రోజులుకు 4వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో ఒక ధైర్యం పెరిగిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి వయసు మీరి పోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార బాధ్యతలు చేపట్టేది ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. అయితే మొన్నటి వరకు నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ బాధ్యతలను నారా లోకేష్ చేపడుతారు అనే మాట వినిపిస్తే, చాలామంది ఒక రకంగా చెప్పాలంటే ఈ మాటను లైట్ గా తీసుకున్నారు.


కానీ ఇప్పుడు ఆయన మంచి పట్టుదలతో ఉత్సాహంతో చేస్తున్న యువగళం పాదయాత్రని చూసి వాళ్లలో ఒక నమ్మకం, ఒక భరోసా పెరిగాయని తెలుస్తుంది. పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నుండి ఏ రోజుకి ఆ రోజు ఆయన లో ఉత్సాహం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని తెలుస్తుంది. అది చూసి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో చంద్రబాబునాయుడు తర్వాత తమ పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు వచ్చాడని ఫీలింగ్ పెరిగిందని తెలుస్తుంది.


దానికి కారణం ఆయనలో పెరిగిన వాక్చాతుర్యం, ఇంకా నిలకడగా మాట్లాడే తత్వం అని తెలుస్తుంది. దాంతో మొన్నటి వరకు చంద్రబాబునాయుడుని విమర్శించి నారా లోకేష్ ని తీసి పడేసిన పక్క పార్టీ వాళ్లు కూడా ఇప్పుడు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు. అంటే దాని అర్థం నారా లోకేష్ సమర్థత వాళ్లకు అర్ధమైందని. ఇప్పుడు ఆ ప్రక్క వర్గం 400 రోజులు 400 ప్రశ్నలు అంటూ లోకేష్ కి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇప్పుడు.



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>