PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/polavaram-jagan-chandrababu-modif4355b56-d8ce-4aeb-ae40-2d318fb719a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/polavaram-jagan-chandrababu-modif4355b56-d8ce-4aeb-ae40-2d318fb719a2-415x250-IndiaHerald.jpgఇక్కడ విషయం ఏమిటంటే మిగిలిన అంశాల్లాగా పోలవరం ప్రాజెక్టు కూడా రాజకీయంగా బాగా వివాదాస్పదమైపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు బలవంతంగా కేంద్రనుండి ప్రాజెక్టును లాక్కున్నారు. చంద్రబాబు గనుక ఆపనిచేయకపోతే ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయ్యుండేది. ప్రాజెక్టు పూర్తిచేయటంలో ప్లస్సులు, మైనస్సులు మొత్తం కేంద్రప్రభుత్వమే భరించాల్సొచ్చేది. కానీ చంద్రబాబు చేసిన పనివల్ల ఇపుడు ప్రాజెక్టు కంపైపోయింది. polavaram jagan chandrababu modi{#}CBN;Jagan;Andhra Pradesh;Narendra Modi;polavaram;Telangana Chief Minister;Minister;Elections;Polavaram Project;June;Father;Reddy;Yevaruఅమరావతి : పోలవరాన్ని ఇద్దరిలో ఎవరు పూర్తిచేస్తారో ?అమరావతి : పోలవరాన్ని ఇద్దరిలో ఎవరు పూర్తిచేస్తారో ?polavaram jagan chandrababu modi{#}CBN;Jagan;Andhra Pradesh;Narendra Modi;polavaram;Telangana Chief Minister;Minister;Elections;Polavaram Project;June;Father;Reddy;YevaruMon, 12 Jun 2023 09:00:00 GMT



ఇపుడీ విషయంపైనే రాజకీయంగా చర్చలు జోరందుకుంటున్నాయి. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన పోలవరం అథారిటి సమావేశానికి ఏపీ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నిదులు, మొదటిదశ ఆయకట్టు పూర్తిచేసి నీరందించే విషయంపైనే చర్చలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 2025, జూన్ అవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్పారు. అలాగే మొదటిదశ నీటినిల్వ, ఆయకట్టుకు నీరివ్వాలంటే వెంటనే రు. 17,144 కోట్లవసరమని చెప్పారు.





ఇక్కడ విషయం ఏమిటంటే మిగిలిన అంశాల్లాగా పోలవరం ప్రాజెక్టు కూడా రాజకీయంగా బాగా వివాదాస్పదమైపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు బలవంతంగా కేంద్రనుండి ప్రాజెక్టును లాక్కున్నారు. చంద్రబాబు గనుక ఆపనిచేయకపోతే ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయ్యుండేది. ప్రాజెక్టు పూర్తిచేయటంలో ప్లస్సులు, మైనస్సులు మొత్తం కేంద్రప్రభుత్వమే భరించాల్సొచ్చేది. కానీ చంద్రబాబు చేసిన పనివల్ల ఇపుడు ప్రాజెక్టు కంపైపోయింది.





ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వటంలేదు, రాష్ట్రప్రభుత్వం దగ్గర డబ్బులేదు. దాంతో ప్రాజెక్టు నిర్మాణం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిజానికి ప్రాజెక్టు 2024, జూన్ కల్లా పూర్తవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 జూన్ అంటే ఎన్నికల సమయం కాబట్టి ఇంకా ముందే జగన్ పూర్తిచేస్తారని అనుకున్నారు. కానీ ఇపుడు 2025, జూన్ అంటున్నారు. అంటే షెడ్యూల్ ఎన్నికలు 2024, మేలో జరగాలి. దీని ప్రకారం పోలవరం ప్రాజెక్టును జగన్, చంద్రబాబులో ఎవరు పూర్తిచేస్తారో అనే చర్చ పెరిగిపోతోంది.





వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అంటే కాదు మేమే అని జగన్, చంద్రబాబు ఇద్దరు చెప్పుకుంటున్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేది తానే అని జగన్ పదిసార్లు చెప్పుంటారు. ఇదే సమయంలో తన హయాంలోనే ప్రాజెక్టుపనులు 70 శాతం అయ్యాయి కాబట్టి మిగిలింది కూడా తానే పూర్తిచేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ప్రాజెక్టుకు మొదటి విలన్ చంద్రబాబు అయితే రెండో విలన్ నరేంద్రమోడీ అనే చెప్పాలి. అలాగే జగన్ చేతకానితనం కూడా కనబడుతోంది. ఈ నేపధ్యంలోనే పోలవరంను ఎవరు పూర్తిచేస్తారనే చర్చ పెరిగిపోతోంది. 




RRR Telugu Movie Review Rating

అమరావతి : పోలవరాన్ని ఇద్దరిలో ఎవరు పూర్తిచేస్తారో ?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>