LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dhanima-rasam02676990-41af-409c-8ac4-9d2e2c361a60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dhanima-rasam02676990-41af-409c-8ac4-9d2e2c361a60-415x250-IndiaHerald.jpgఅల్పాహారం సమయం తర్వాత కాఫీ,టీలు తీసుకునే బదులుగా కూరగాయలు,పండ్లతో చేసే జ్యూస్ లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.ముఖ్యంగా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అందులోని ప్రోటీన్,కార్బోహైడ్రేట్, ఫైబర్,ఐరన్,విటమిన్ సి,పొటాషియం,ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.తరుచూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల,మన శరీరానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం పదండీ.. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు రోజు ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల,అందులోని ఐరన్ మరియు విటమిన్ సి కొతDHANIMA RASAM{#}Iron;Pregnant;Heart;Vitamin C;Pomegranate;Shaktiరోజూ దానిమ్మ రసం తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?రోజూ దానిమ్మ రసం తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?DHANIMA RASAM{#}Iron;Pregnant;Heart;Vitamin C;Pomegranate;ShaktiMon, 12 Jun 2023 19:16:00 GMTఅల్పాహారం సమయం తర్వాత కాఫీ,టీలు తీసుకునే బదులుగా కూరగాయలు,పండ్లతో చేసే జ్యూస్ లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.ముఖ్యంగా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అందులోని ప్రోటీన్,కార్బోహైడ్రేట్, ఫైబర్,ఐరన్,విటమిన్ సి,పొటాషియం,ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.తరుచూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల,మన శరీరానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం పదండీ..

గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు రోజు ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల,అందులోని ఐరన్ మరియు విటమిన్ సి కొత్త రక్తకణాలు వృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి.మరియు ఇందులోని పోలిక్ యాసిడ్ డెలివరీ సమయంలో కలిగే సమస్యలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.కావున ఇది గర్భిణీ స్త్రీలకు వరమని చెప్పవచ్చు.

దానిమ్మ రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.దానితో ఇమ్యూన్ సిస్టమ్ సక్రమంగా పనిచేసి, రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది.దీనితో సీజనల్ మార్పులు కలిగినప్పుడల్లా వచ్చే బ్యాక్టీరియల్, పంగస్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.ముఖ్యంగా దానిమ్మ రసం పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది.

రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.దానితో మలబద్ధకం,గ్యాస్,ఉబ్బరం వంటి సమస్యలను దూరం అవుతాయి.రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడంతో కడుపులోని వ్యర్థలన్ని బయటకు వెళ్ళిపోయి బాగా శుభ్రపడుతుంది.

ఈ మధ్యకాలంలో యుక్త వయసులోనే గుండె జబ్బులు చాలామంది మరణం వరకు వెళ్తూ ఉన్నారు.దానికి కారణం మన శరీరంలో సిస్టోలిక్ ప్రెషర్ ఎక్కువ అవ్వడమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలా సిస్టోలి ప్రెజర్ ని తగ్గించడానికి దానిమ్మ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.రోజూ దానిమ్మ రసం  తీసుకోవడం వల్ల,రక్తనాళాల నుంచి రక్తం గుండెకు సక్రమంగా సరఫరా అయి,గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.దీనితో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా దానిమ్మ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.రోజు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల కిడ్నీలో ఫామ్ అయిన రాళ్లను సైతం కరిగించే అంత సుగుణాలు పుష్కలంగా లభిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ చిన్నాపెద్ద తేడా లేకుండా తరచూ దానిమ్మ రసం తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.



RRR Telugu Movie Review Rating

జనసేన పార్టీలోకి టాలీవుడ్ బడా నిర్మాత?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>