MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purush00954225-bf1f-4d04-bce9-ef758b06a860-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purush00954225-bf1f-4d04-bce9-ef758b06a860-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ కృతీసనన్‌ సీతమ్మగా నటించింది. భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ సినిమాను నిర్మించారు.ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్‌ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియADI PURUSH{#}Khammam;UV Creations;Kavuru Srinivas;Divya Bhatnagar;history;Saif Ali Khan;social media;Telangana;Heroine;AdiNarayanaReddy;bollywood;Telugu;krishnam raju;media;Prabhas;India;Cinemaప్రతి రామాలయానికి ఆదిపురుష్ టిక్కెట్లు ఫ్రీ?ప్రతి రామాలయానికి ఆదిపురుష్ టిక్కెట్లు ఫ్రీ?ADI PURUSH{#}Khammam;UV Creations;Kavuru Srinivas;Divya Bhatnagar;history;Saif Ali Khan;social media;Telangana;Heroine;AdiNarayanaReddy;bollywood;Telugu;krishnam raju;media;Prabhas;India;CinemaMon, 12 Jun 2023 16:15:00 GMTపాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ కృతీసనన్‌ సీతమ్మగా నటించింది. భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ సినిమాను నిర్మించారు.ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్‌ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్‌ చేస్తోంది. అయితే రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడన్న నమ్మకంతో ఆది పురుష్‌ సినిమాని ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. ఇంకా అలాగే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరోలు పిల్లలందరూ ప్రభాస్‌ ను చూడాలని 10వేలకు పైగా టికెట్లను ముందుగా బుక్‌ చేయనున్నారు. ఇప్పుడీ ఇలాంటి మంచి కార్యంలో శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది.


 ఇందులో భాగంగా తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(101 ) ఆది పురుష్ టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత అయిన గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని ఆయన సోషల్‌ మీడియా వేదికగా కోరారు.'శ్రీరాముడు, సీతమాత గాథ అందరికీ కూడా ఆదర్శం. ఆ దివ్యమైన చరిత్రే ఆదిపురుష్‌ సినిమా. ఆ ఆదర్శవంతమైన దివ్య మంగళ చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా చేరాలనే సంకల్పంతో ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి రామాలయానికి  మొత్తం 100 టిక్కెట్లు ఇవ్వదల్చుకున్నాం. ఈ టికెట్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు' అని శ్రేయాస్‌ మీడియా ట్వీట్‌ చేసింది. ఆది పురుష్‌ లో బాలీవుడ్‌ విలక్షణ నటుడు అయిన సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ రావణాసురుడుగా నటిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజైన ఈ టీజర్ , ట్రైలర్స్ పై అంచనాలను అమాంతం అమాంత పెంచేశాయి.
" style="height: 1007px;">



RRR Telugu Movie Review Rating

జనసేన పార్టీలోకి టాలీవుడ్ బడా నిర్మాత?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>