PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu1166074c-74c7-4b91-80a1-447cf45331ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu1166074c-74c7-4b91-80a1-447cf45331ac-415x250-IndiaHerald.jpgఈ నేపధ్యంలోనే మీడియాతో మాట్లాడుతు నెల్లూరులో లోకేష్ పాదయాత్ర అయిపోగానే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాను రాజీనామా చేస్తానని చంద్రబాబుకు చెప్పగానే వద్దన్నారట. రాజీనామా చేసే విషయాన్ని పాలిట్ బ్యూరోలో చర్చించి ఏ విషయం చెబుతానన్నారట. రాజీనామా చేయాలా వద్దా అన్న విషయం నిర్ణయించుకోవాల్సింది ఆనమే కానీ చంద్రబాబుకు ఏమిసంబంధం. వైసీపీ ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఆనంను టీడీపీలో చేరమనేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. tdp chandrababu anam kotamreddy{#}ramakrishna;రాజీనామా;sub elections;Udayagiri;MLA;Lokesh;Lokesh Kanagaraj;TDP;YCP;Nellore;Fridayఅమరావతి : చంద్రబాబు అంత ధైర్యచేయగలరా ?అమరావతి : చంద్రబాబు అంత ధైర్యచేయగలరా ?tdp chandrababu anam kotamreddy{#}ramakrishna;రాజీనామా;sub elections;Udayagiri;MLA;Lokesh;Lokesh Kanagaraj;TDP;YCP;Nellore;FridayMon, 12 Jun 2023 05:00:00 GMT



వెంకటగిరి వైసీపీ ఎంఎల్ఏగా ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేయాలా వద్దా అన్న విషయాన్ని చంద్రబాబునాయుడు డిసైడ్ చేస్తారట. వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజం. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఆనమే మీడియాతో చెప్పారు. టీడీపీలో చేరటానికి ఆనం రంగం రెడీచేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. తర్వాత శనివారమంతా నెల్లూరు టీడీపీ నేతలతో బిజీబిజీగా గడిపారు. టీడీపీ ఆఫీసుకు కూడా వెళ్ళారు.





ఈ నేపధ్యంలోనే మీడియాతో మాట్లాడుతు నెల్లూరులో లోకేష్ పాదయాత్ర అయిపోగానే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాను రాజీనామా చేస్తానని చంద్రబాబుకు చెప్పగానే వద్దన్నారట. రాజీనామా చేసే విషయాన్ని పాలిట్ బ్యూరోలో చర్చించి ఏ విషయం చెబుతానన్నారట. రాజీనామా చేయాలా వద్దా అన్న విషయం నిర్ణయించుకోవాల్సింది ఆనమే కానీ చంద్రబాబుకు ఏమిసంబంధం. వైసీపీ ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఆనంను టీడీపీలో చేరమనేంత ధైర్యం చంద్రబాబుకు లేదు.






ఎందుకంటే ఆనంను రాజీనామా చేయమంటే అదేపద్దతిని మిగిలిన ఇద్దరికీ వర్తింపచేయాలి. ఎందుకంటే ఆనంతో పాటు నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉదయగిరి ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు కాబట్టి. వీళ్ళముగ్గురు రాజానామాలు చేయగానే ఉపఎన్నికలు వచ్చే అవకాశముంది. ఉపఎన్నికల్లో ఎవరిని పోటీచేయించాలన్నది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారుతుంది. వెంకటగిరిలో ఆనంకు టికెట్ ఇవ్వటానికి టీడీపీ ఇన్చార్జి,  మాజీ ఎంఎల్ఏ కురగొండ్ల రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.





అలాగే పార్టీలో కోటంరెడ్డిని చేర్చుకునే విషయంలోనే చాలామంది తమ్ముళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అలాంటిది ఉపఎన్నికలో టికెట్ ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా ? టికెట్ ఇవ్వటాన్ని అడ్డుకోలేకపోవచ్చు కానీ గెలుపును దెబ్బతీయచ్చు. ఉపఎన్నికలో వెంకటగిరిలో టికెట్ ఇవ్వకపోతే ఆనంకు అవమానం, ఇస్తే గెలుపు డౌటే. ఇన్ని తలనొప్పులను భరించేంత సీన్ చంద్రబాబుకు లేదు. కాబట్టి ఆనం రాజీనామాకు పాలిట్ బ్యూరో అంగీకరిస్తుందని అనుకునేందుకు లేదు. ఇపుడు మూడుఉపఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోతే దీని ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడుతుంది. వీళ్ళచేరికపై టీడీపీలో గందరగోళమైపోతుంది. మరి పాలిట్ బ్యూరో ఏమిచేస్తుందో చూడాల్సిందే.




RRR Telugu Movie Review Rating

ఆది పురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>