LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/vantasarukulub5ddbfd7-5597-4b63-bd3b-1eac1cfb6e86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/vantasarukulub5ddbfd7-5597-4b63-bd3b-1eac1cfb6e86-415x250-IndiaHerald.jpgప్రతీ ఒకరి వంటగదిలో నెలకి సరిపడా సరుకులు తప్పనిసరిగా తెచుకుంటూ ఉంటాము.సరుకులను ఎక్కువరోజులు నిల్వ ఉంచామంటే అందులో కచ్చితంగా చీమలు,పురుగులు పడతాయి.అలాంటి వాటినితిరిగి ఉపయోగించాలంటే మహిళలు వాటిని పడేయలేక మరియు క్లీన్ చేయలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా కీటకాలకు మరియు చీమలకు భయపడతారు.అంతేకాదు వంటగదిలో బొద్దింకలు కొన్ని ఇళ్లలో సర్వసాధారణమైపోయాయి.ఇలాంటి క్రిమి కీటకాలు బారిన పడకుండా సరుకులు కాపాడుకోవాలంటే కొన్ని రకాల టిప్ లు పాటించడం తప్పనిసరి.అ టిప్స్ తో మహిళలు తమ పనిని సులువు చేసుకుంటారు.అVANTASARUKULU{#}Cinnamonవంట సరుకులు పాడవకుండా ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే..?వంట సరుకులు పాడవకుండా ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే..?VANTASARUKULU{#}CinnamonSun, 11 Jun 2023 19:00:00 GMTప్రతీ ఒకరి వంటగదిలో నెలకి సరిపడా సరుకులు తప్పనిసరిగా తెచుకుంటూ ఉంటాము.సరుకులను ఎక్కువరోజులు నిల్వ ఉంచామంటే అందులో కచ్చితంగా చీమలు,పురుగులు పడతాయి.అలాంటి వాటినితిరిగి ఉపయోగించాలంటే మహిళలు వాటిని పడేయలేక మరియు క్లీన్ చేయలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా కీటకాలకు మరియు చీమలకు భయపడతారు.అంతేకాదు వంటగదిలో బొద్దింకలు కొన్ని ఇళ్లలో సర్వసాధారణమైపోయాయి.ఇలాంటి క్రిమి కీటకాలు బారిన పడకుండా సరుకులు కాపాడుకోవాలంటే కొన్ని రకాల టిప్ లు పాటించడం తప్పనిసరి.అ టిప్స్ తో మహిళలు తమ పనిని సులువు చేసుకుంటారు.అలాంటి మార్గాలంటే ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

కొంతమంది ఫ్రిడ్జ్ లో ఖాళీగా ఉంది కదా అని పప్పులు, ఉప్పులు అన్ని ఫ్రిజ్లో పడేస్తూ వుంటారు.ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి.అలాంటప్పుడు పాత చిట్కాలు వాడటం మంచిది.బియ్యం,కందిపప్పు వంటి వాటిని స్టోర్ చేసుకునేటప్పుడు ఒక గుడ్డముక్క తీసుకొని,అందులో గుప్పెడు వేపాకులు వేసి మూట కట్టి వాటిలో ఉంచాలి.ఇలా చేయడం వల్ల అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు ఘాటైన వాసన  వల్ల క్రిమికీటకాలు దరిచేరకుండా ఉంటాయి.

ఉప్మా రవ్వ,ఓలిగ రవ్వ వంటివి స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా తెల్ల పురుగులు వస్తుంటాయి.అలాంటప్పుడు కొంచెం కర్పూరం పొడి,ఒక స్ఫూన్ లవంగాల పొడి తీసుకొని,మూట కట్టి రవ్వ దాచుకునే బాక్స్లో ఉంచాలి.దీనివల్ల నల్లటి పురుగులు తెల్లటి పురుగులు ఏవి పట్టవు.

వేరుశనగ విత్తనాలు,రాగులు,జొన్నలు,సజ్జలు వంటివి  పూర్వకాలంలో ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవడానికి,ఎండలో కొద్దిరోజులు ఎండబెట్టే వారు.సూర్యుడు నుంచి వచ్చే సూర్యరశ్మి వల్ల, బ్యాక్టిరియా తొందరగా నివారించబడి,పురుగులు పట్టకుండా నిల్వ ఉంటాయి.కావున పూర్వ పద్దతులను అనుసరించడం ఉత్తమం.

కారం పొడి,పసుపు పొడి,ధనియాలు పొడి వంటివి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే,వాటిని పిండి మర పట్టించేటప్పుడే రెండు బిరియాని ఆకులు, రెండు లవంగాలు,ఒక ముక్క దాల్చిన చెక్క వేసి,మర పట్టించుకోవాలి.అ తర్వాత తేమ లేని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.దానితో తొందరగా పంగస్ బారిన పడకుండా,ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

బుల్లితెర నుండి వెండితెర కు ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్....!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>