MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithu9c1a3189-3374-4ca2-a3f8-baf74b51c677-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithu9c1a3189-3374-4ca2-a3f8-baf74b51c677-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇళయ రాజా ... యువన శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో అరవింద స్వామి ... ప్రియమణి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ తెలుగు , తమిళ భాషల్లో రూChaithu{#}Naga Chaitanya;priyamani;raja;shankar;venkat prabhu;Music;Yuva;Box office;Tamil;Heroine;Telugu;Cinema"కస్టడీ" మూవీకి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"కస్టడీ" మూవీకి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Chaithu{#}Naga Chaitanya;priyamani;raja;shankar;venkat prabhu;Music;Yuva;Box office;Tamil;Heroine;Telugu;CinemaSun, 11 Jun 2023 04:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇళయ రాజా ... యువన శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో అరవింద స్వామి ... ప్రియమణి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ తెలుగు , తమిళ భాషల్లో రూపొందింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ టోటల్ రన్ మూగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.31 కోట్ల షేర్ ... 10.5 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసులు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 33 లక్షల కలెక్షన్ లను , ఓవర్ సీస్ లో 1.18 కోట్ల కలెక్షన్ లను , తమిళ నాడు లో 38 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.20 కోట్ల షేర్ ... 15.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ నుండి పై మొదటి నుండి తెలుగు , తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 24.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఈ మూవీ కి మొత్తంగా 17.18 కోట్ల నష్టాలు వచ్చాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

జోరు పెంచిన జగన్.. రేపు ఆ జిల్లాలో యాత్ర?

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>