MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purushdce5f9e6-c524-468e-99f5-632ccc0138ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purushdce5f9e6-c524-468e-99f5-632ccc0138ce-415x250-IndiaHerald.jpgఆదిపురుష్ సినిమాపై అంచనాలు బాగా పెరుగుతూనే ఉన్నాయి. మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం కేవలం ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కు రికార్డు రేంజ్ లో స్పందన లభిస్తోంది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లో ముందస్తు బుకింగ్స్ లో కేజీఎఫ్-2 రికార్డును ఆదిపురుష్ సినిమా బీట్ చేసింది.'ఆదిపురుష్' సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే ముందస్తు టికెట్ బుక్సింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సADI PURUSH{#}krishnam raju;New Zealand;Australia;bollywood;Prabhas;Population;Hindi;News;June;India;Heroine;Director;Hero;Cinemaఆదిపురుష్: అన్ని చోట్లా పులి.. అక్కడ మాత్రం పిల్లి?ఆదిపురుష్: అన్ని చోట్లా పులి.. అక్కడ మాత్రం పిల్లి?ADI PURUSH{#}krishnam raju;New Zealand;Australia;bollywood;Prabhas;Population;Hindi;News;June;India;Heroine;Director;Hero;CinemaSun, 11 Jun 2023 18:26:18 GMTఆదిపురుష్ సినిమాపై అంచనాలు బాగా పెరుగుతూనే ఉన్నాయి. మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం కేవలం ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కు రికార్డు రేంజ్ లో స్పందన లభిస్తోంది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లో ముందస్తు బుకింగ్స్ లో కేజీఎఫ్-2 రికార్డును ఆదిపురుష్ సినిమా బీట్ చేసింది.'ఆదిపురుష్' సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే ముందస్తు టికెట్ బుక్సింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదల కానున్న సందర్భంగా కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అందులో భాగంగా ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి అమెరికాలో 187 ప్రాంతాల్లో 10,727 టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో పాటు ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ లో కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తోంది.


ఈ దేశాల్లో కేజీఎఫ్-2 సినిమా రికార్డులను ఆదిపురుష్ బద్దలు గొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా అంతేకాకుండా ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షోలో కూడా మంచి స్పందన లభిస్తోంది. ఆ సైట్ లో ఏకంగా 5 లక్షలకు పైగా ఇంట్రెస్ట్ రిజిస్టర్ అయ్యాయి. ఈ సినిమాని హిందీ భాషలో దాదాపు 4 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. హిందీ సహా దేశ వ్యాప్తంగా మొత్తం 620 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.కానీ తమిళనాడులో మాత్రం పరిస్థితి భిన్నంగా వుంది. అక్కడ ఆశించిన రేంజ్ లో ఈ సినిమాకి బజ్ క్రియేట్ అవ్వట్లేదు. అందువల్ల అక్కడ బుకింగ్స్ తక్కువగా నమోదు అయ్యాయి. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. హాట్ హీరోయిన్ కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ విడుదల చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

బుల్లితెర నుండి వెండితెర కు ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్....!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>