Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledadf5893-033f-4c0a-b30c-f891892036b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledadf5893-033f-4c0a-b30c-f891892036b5-415x250-IndiaHerald.jpgపెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్‌ కలల రాకుమారిగా నటించిన హీరోయిన్‌ ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. తన ప్రొడక్షన్‌ హౌస్‌ పనులు చూసుకుంటూ గడుపుతున్నారు.శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా 1990లలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఈ సినిమాలో రవళి, దీప్తి భత్నగర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్‌ తరచూ ఓ అమ్మాయి గురించి కలలు కంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అతడి కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈsocialstars lifestyle{#}marriage;Girl;social media;Darsakudu;Director;Hero;television;Cinema;Teluguగుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్రీకాంత్ హీరోయిన్....!!గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్రీకాంత్ హీరోయిన్....!!socialstars lifestyle{#}marriage;Girl;social media;Darsakudu;Director;Hero;television;Cinema;TeluguSun, 11 Jun 2023 18:25:00 GMTపెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్‌ కలల రాకుమారిగా నటించిన హీరోయిన్‌ ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. తన ప్రొడక్షన్‌ హౌస్‌ పనులు చూసుకుంటూ గడుపుతున్నారు.శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా 1990లలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఈ సినిమాలో రవళి, దీప్తి భత్నగర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్‌ తరచూ ఓ అమ్మాయి గురించి కలలు కంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అతడి కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ కలల రాకుమారే ‘ దీప్తి భత్నగర్‌’. సినిమాలోనే నిజ జీవితంలోనూ ఆమె ఎంతో మంది కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయారు. దీప్తికి ఇది తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.

అవకాశాలు కూడా బానే వచ్చాయి. దీప్తి తెలుగులో పలు హిట్టు సినిమాల్లో నటించారు. 2002లో వచ్చిన ‘కొండవీటి సింహాసనం’ సినిమా తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు రణ్‌దీప్‌ ఆర్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. పెళ్లి తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఆమె సినిమాల్లో కొనసాగారు. 2007లో వచ్చిన ‘రాకిలిపట్టు’ అనే మలయాళ సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సినిమాల్లో ఉండగానే ఆమె ‘దీప్తి భత్నగర్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా పలు టీవీ షోలను నిర్మించారు. ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా షోలను నిర్మిస్తూ ఉన్నారు.

దీప్తి సోషల్‌ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమెకు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ఖాతాలు ఉన్నాయి. వాటిలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటారు. దీప్తికి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే విదేశాల్లో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అందుకే ట్రావెలింగ్‌ మీద ఓ షోను కూడా చేశారు. అది ప్రముఖ ఛానళ్లలో ప్రసారం కూడా అయింది. ఇక, దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2022లో రెండోసారి వెండితెరపై తలుక్కుమన్నారు. పెళ్లిసందDలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు.



RRR Telugu Movie Review Rating

బుల్లితెర నుండి వెండితెర కు ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్....!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>