Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/politics_latestnews/wtcda9f33cb-69ef-4965-91c3-d8d32b1e7aa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/politics_latestnews/wtcda9f33cb-69ef-4965-91c3-d8d32b1e7aa3-415x250-IndiaHerald.jpgవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనే మహాసంగ్రామం లో టీమిండియా మొదటి నుంచి తడబాటుకు గురవుతుంది. అయితే 2021లో డబ్ల్యూటీసి ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకున్నట్లుగా కాకుండా ఈసారి తప్పకుండా విశ్వవిజేతగా నిలుస్తుందని అందరూ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో అందరి ఆశలను అడియాశలు చేసే లాగే కనిపిస్తూ ఉంది టీమిండియా ప్రదర్శన. మొదటిరోజు ఆట నుంచే ఎక్కడ ప్రభావం చూపలేక పోతుంది అని చెప్పాలి. ఇక జట్టులో ఉన్న కీలక బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేస్తూ ఉండడంతో ఇక ఆస్ట్రేలియాకు కనీస పోటీ ఇWtc{#}Kurradu;England;ravi shastri;ravi anchorగిల్ అంటే కుర్రాడు.. కానీ పూజార నీకేమైంది?గిల్ అంటే కుర్రాడు.. కానీ పూజార నీకేమైంది?Wtc{#}Kurradu;England;ravi shastri;ravi anchorSat, 10 Jun 2023 09:30:00 GMTవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనే మహాసంగ్రామం లో టీమిండియా మొదటి నుంచి తడబాటుకు గురవుతుంది. అయితే 2021లో డబ్ల్యూటీసి ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకున్నట్లుగా కాకుండా ఈసారి తప్పకుండా విశ్వవిజేతగా నిలుస్తుందని అందరూ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో అందరి ఆశలను అడియాశలు చేసే లాగే కనిపిస్తూ ఉంది టీమిండియా ప్రదర్శన. మొదటిరోజు ఆట నుంచే ఎక్కడ ప్రభావం చూపలేక పోతుంది అని చెప్పాలి. ఇక జట్టులో ఉన్న కీలక బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేస్తూ ఉండడంతో ఇక ఆస్ట్రేలియాకు కనీస పోటీ ఇవ్వలేక పోతుంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే టీమిండియా మంచి ప్రదర్శన చేసి గెలుస్తుంది అన్న నమ్మకం మాత్రం ఎవరిలో కనిపించడం లేదు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి అటు టీమిండియా 296 పరుగుల వెనుకబడి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా ఆట తీరుపై మాజీ ఆటగాళ్లందరూ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేసి నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా చేతులు ఎత్తడం ఎన్నో రోజుల నుంచి జరుగుతూనే వస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇక ఇటీవలే జరిగిన మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజార అవుట్ అయిన విధానం పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 టెస్ట్ ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న పూజార అవుట్ అయిన విధానంపై రవి శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై ఏ బంతిని వదిలేయాలో తెలియడంతోపాటు ఆఫ్ స్టాంప్ ఎక్కడుందో గుర్తు పెట్టుకోవాలి. ఫుట్ వర్క్ విషయంలో గిల్ కాస్త బద్ధకంగా కనిపించాడు. అతను అంటే కుర్రాడు ఇంకా నేర్చుకుంటున్నాడు.. పూజార నీకు ఏమైంది. పూజారా బంతిని వదిలేయడంతో నేరుగా వికెట్లను తాకింది. ఇక ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాను అంటూ రవి శాస్త్రం చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

మహేష్ మూవీ తర్వాత ఆ ప్లానింగ్ లో త్రివిక్రమ్..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>