HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgప్రతి మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. అలాంటి కోవకు చెందినది పులి చింత మొక్క.. ఇక వర్షాకాలంలో ఈ మొక్క విరివిగా పెరుగుతుంది. మన ఇంట్లో పెంచుకుంటున్న పూల కుండీల్లో కూడా ఈ మొక్క పెరిగి నిండుగా పాకుతుంది. ఈ ఆకులను పప్పు పులుసు కూరగా వండుకుని తింటారు.. పులి చింత ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోతారు..ఈ తీగ జాతి మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. అందుకే వీటికి పులి చింత అనే పేరు వచ్చింది.. ఈ పులి చింత ఆకు వలన ముక్కు, గొంతు ఇంకాhealth{#}Tiger;Jaggery;Ghee;Rock salt;Hingఈ ఆకుతో ఆరోగ్యానికి కోటి లాభాలు?ఈ ఆకుతో ఆరోగ్యానికి కోటి లాభాలు?health{#}Tiger;Jaggery;Ghee;Rock salt;HingSat, 10 Jun 2023 19:26:03 GMTప్రతి మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. అలాంటి కోవకు చెందినది పులి చింత మొక్క.. ఇక వర్షాకాలంలో ఈ మొక్క విరివిగా పెరుగుతుంది. మన ఇంట్లో పెంచుకుంటున్న పూల కుండీల్లో కూడా ఈ మొక్క పెరిగి నిండుగా పాకుతుంది. ఈ ఆకులను పప్పు పులుసు కూరగా వండుకుని తింటారు.. పులి చింత ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోతారు..ఈ తీగ జాతి మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. అందుకే వీటికి పులి చింత అనే పేరు వచ్చింది.. ఈ పులి చింత ఆకు వలన ముక్కు, గొంతు ఇంకా మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది. అలాగే గొంతు సంబంధిత రోగాలను అరికడుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి ఈజీగా త్వరగా రాలిపోతాయి. ఇంకా అంతే కాకుండా ఈ ఆకులను పప్పుగా వండుకొని తిన్నా కూడా చక్కటి ఫలితం కలుగుతుంది. వాతం తగ్గించడానికి ఈ ఆకులు బాగా సహాయపడతాయి.


ఈ ఆకులను, సొంటి, నెయ్యి ఇంకా తేనె సమాన మోతాదు లో కలిపి తీసుకుంటే వాతం ఈజీగా తగ్గుతుంది. ఇంకా ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. అలాగే నిద్రలేమికి మేలు చేస్తుంది. ఇంకా కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు ఈజీగా రాలిపోతాయి. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు ఈజీగా గట్టిపడతాయి. పులిచింత మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు ఇంకా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా చాలా త్వరగా విషం దిగిపోతుంది. అలాగే పులిచింత ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత కూడా తగ్గుతుంది.ఇంకా 40 నుంచి 60 మి.లీ ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది.పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి ఈజీగా తగ్గిపోతుంది. ఈ ఆకులను కూరగా ఇంకా పచ్చడిగా వండుకుని తింటే ఆస్తమా నుంచి ఈజీగా ఉపశమనం కలుగుతుంది.



RRR Telugu Movie Review Rating

వారికోసం భిక్షాటన చేస్తున్న ఫైట్ మాస్టర్స్...!!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>